నోరు జారారా.. వ్యూహమా : BJPలో చేరాలంటే యూత్ అయ్యి ఉండాలి

నోరు జారారా.. వ్యూహమా :  BJPలో చేరాలంటే యూత్ అయ్యి ఉండాలి

Updated On : October 16, 2019 / 7:37 AM IST

ఉద్యోగాల్లో, చదువుల్లో మాత్రమే కాదు రాజకీయాల్లోనూ ఏజ్ లిమిట్ (వయస్సు పరిమితి) వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ సరికొత్త విధానానికి నాంది పలికింది. బీజేపీలో సీనియర్ విభాగంలో చేరాలంటే 75ఏళ్లకు మించి ఉండకూడదనే నియమంతో పాటు యువజన విభాగంలోకి చేరాలంటే 35ఏళ్లకు మించకూడదు. 

పార్టీలోకి యువత రావాలనే ఉధ్దేశ్యంతో వయస్సు పరిమితిని ప్రకటించింది. జిల్లాలు, మండలాలు నుంచి పార్టీలో చేరాలనుకునేవారికి ఆహ్వానం పలికింది. దాంతో పాటే నియమాలు, సూచనలను తెలిపింది. ప్రస్తుత ఏడాది డిసెంబరులో పార్టీ జాతీయ ప్రెసిడెంట్‍‌ ఎన్నికలు జరగనుండగా పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షా త్వరలోనే పార్టీకి కొత్త ప్రెసిడెంట్ రానున్నట్లు ప్రకటించారు. 

జాతీయ పార్టీలో సభ్యత్వం, నాయకత్వానికి వయస్సు పరిమితి ఉండాలి. మండలాలు, జిల్లాల వారీగా వారి నియమాలు తెలియజేశాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వారికి అవి వర్తిస్తాయి.  పార్టీ జాతీయ ప్రెసిడెంట్‌కు 50-55ఏళ్ల వయస్సు, రాష్ట్ర పార్టీ లీడర్లకు 50ఏళ్లు లేదా అంతకంటే తక్కువ, జిల్లా స్థాయి నాయకులకు 40 నుంచి 45ఏళ్లు, మండల స్థాయితో పాటు యువజన నాయకులకు 35ఏళ్లకు మించి ఉండకూడదని తెలిపింది.