వచ్చే ఐదేళ్లు హార్డ్‌వర్క్ చేస్తే తమిళనాడులో బీజేపీ గెలుస్తుంది: అమిత్ షా

వచ్చే ఐదేళ్లు హార్డ్‌వర్క్ చేస్తే తమిళనాడులో బీజేపీ గెలుస్తుంది: అమిత్ షా

AIADMK కో ఆర్డినేటర్ ఓ పన్నీర్‌సెల్వం, కో ఆర్డినేటర్ పళనిస్వామిలు బీజేపీతో పొత్తు గురించి ప్రకటించి 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్టీ సభ్యులతో ప్రైవేట్ హోటళ్లో మీటింగ్ ఏర్పాటు చేసి.. తర్వాతి ఐదేళ్లలో గెలిచేందుకు కార్యచరణ గురించి చర్చించారు.గంటన్నరపాటు జరిగిన మీటింగ్ లో దాదాపు 200మంది పార్టీ సభ్యులు పాల్గొన్నారు. షా.. త్రిపుర, బీహార్ లాంటి రాష్ట్రాలను ఉదహరించి తమిళనాడు నేతలకు కాన్ఫిడెన్స్ పెంచేలా మాట్లాడారు. పార్టీ క్యాడర్ కఠినంగా శ్రమించి.. పనిచేస్తే ఐదేళ్ల తర్వాత బీజేపీ రాష్ట్రాన్ని పాలిస్తుందని చెప్పారు.

ఈ మీటింగ్ లో కొందరు బీజేపీ సభ్యులు ఏఐఏడీఎంకేతో ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మున్ముందు కరెక్ట్ గానే హ్యాండిల్ చేస్తుందంటూ మాటిచ్చారు.