మోడీ పాలనలో మూకదాడులు పెరగలేదు…ప్రత్యేక చట్టం అవసరంలేదన్న షా

  • Published By: venkaiahnaidu ,Published On : October 17, 2019 / 05:56 AM IST
మోడీ పాలనలో మూకదాడులు పెరగలేదు…ప్రత్యేక చట్టం అవసరంలేదన్న షా

Updated On : October 17, 2019 / 5:56 AM IST

బీజేపీ పాలనలో దేశంలో మూకదాడులు పెరిగిపోతున్నాయన్న వార్తలను కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ విషయంపై దురుద్దేశ్యంతో అసత్యపు ప్రచారం జరుగుతోందని షా అన్నారు. ఎవరైనాచనిపోతే దానికి సెక్షన్ 302 ఉందని,ప్రతిచోటా ఇది ఉపయోగించబడుతుందని సా అన్నారు. వివిధ రాష్ట్రాలలోని బీజేపీ ప్రభుత్వాలు ఇలాంటి కేసులను దర్యాప్తు చేసి అనుమానితులపై చార్జ్ షీటు నమోదు చేసినట్లు షా తెలిపారు.

ఓ ఇంటర్వ్యూలో షా మాట్లాడుతూ…కావాలనే మూకదాడులకు రాజకీయరంగు పులుముతున్నారని ఆరోపించారు. దీని డీల్ చేయడానికి ఇప్పటికే చాలా చట్టాలు ఉన్నాయని,ఇప్పుడు దీని కోసం ప్రత్యేక చట్టం అవసరం లేదని ఆయన అన్నారు. ప్రజల్లో అవగాహనా కల్గించడం ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందని షా విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీ హయాంలో ఈ సంఘటనలు పెరుగుతున్నాయన్న వార్తలను షా ఖండించారు. గతంలో కూడా జరిగాయని షా అన్నారు.

అయితే గడిచిన నాలుగేళ్లలో దేశంలో మూకదాడుల్లో వందలమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఎక్కువగా ఆవు మాంసం విషయంలో మూకదాడులు జరిగాయి. మూకదాడులపై స్పందించాలని,భారత్ మాతా కీ జై,వందేమాతరం అనకపోతే కొట్టి చంపుతున్నారని,జై శ్రీరామ్ ను రెచ్చగొట్టే నినాదంగా ఉపయోగించబడుతుందంటూ ఇటీవల 49మంది ప్రముఖులు ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇటీవల దసరా సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతూ…మూకదాడులు మన సంస్కృతి కాదని,పాశ్చాత్య దేశాల సంస్కృతి అన్నారు. దీని వల్ల భారత్ కు చెడ్డపేరు వస్తోందన్నారు.