Amit Shah Mission 2022 : యూపీపై షా ఫోకస్, మిషన్ 2022 బ్లూ ప్రింట్ ఫైనలైజ్!
బీజేపీకి అఖండ మెజార్టీ తీసుకురావడంతో కీ రోల్ ప్లే చేసిన హోం మంత్రి అమిత్ షా.. మరోసారి ఉత్తరప్రదేశ్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతానికి ఆయన ముందున్న లక్ష్యం ఒక్కటే... మిషన్ 2022.

Up Election 2022
Uttar Pradesh Amit Shah : 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ యూపీలో తిరుగులేని విజయం సాధించింది. ఆయన పర్యవేక్షణలో 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం విరగబూసింది. యూపీ ఎన్నికల చరిత్రను తిరగరాస్తూ బీజేపీకి అఖండ మెజార్టీ తీసుకురావడంతో కీ రోల్ ప్లే చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మరోసారి ఉత్తరప్రదేశ్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతానికి ఆయన ముందున్న లక్ష్యం ఒక్కటే… మిషన్ 2022. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఏడాది కూడా గడువు లేదు. గత ఎన్నికలకు ఈసారికి పరిస్థితులు చాలా మారిపోయాయి. యోగి పాలనపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో అమిత్‌షా రంగంలోకి దిగిపోయారు.
Read More : Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత.. శోకసంద్రంలో శాండల్‌వుడ్..
యూపీ చేజారిపోకుండా ఉండేందుకు రెడీ అయ్యారు ఉత్తరప్రదేశ్‌లో ఆయన పర్యటించనున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బ్లూ ప్రింట్‌ను రెడీ చేయబోతున్నారు. అమిత్ షా ఇప్పటికే లక్నో చేరుకున్నారు. డిఫెన్స్ ఎక్స్ పో గ్రౌండ్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అవధ్‌లోని బీజేపీ ఆఫీసులో.. శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జిలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎల్‌ఈడీ క్యాంపెయిన్ వాహనాలకు జెండా ఊపనున్నారు. ఆ తర్వాత బీజేపీ యూపీ ఆఫీసులో.. పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, 2019 లోక్‌సభ ఎన్నికల నాటి పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్ లతో చర్చలు జరపనున్నారు.
Read More : AP : న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, పంచ్ ప్రభాకర్‌కు పంచ్ తప్పదా ?
మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్, పార్టీ సీనియర్ నేతలతోనూ అమిత్ షా సమావేశమై చర్చించనున్నారు. అటు అసెంబ్లీ నియోజకవర్గాల పోల్ ఇన్‌ఛార్జిలతోనూ చర్చించే అవకాశం ఉంది. రోజంతా చర్చలు జరిపాక మిషన్ 2022కి బ్లూ ప్రింట్‌ను ఫైనలైజ్ చేయనున్నారు అమిత్ షా. పార్లమెంటరీ పార్టీ ఇన్‌ఛార్జ్ లతో సమావేశమై పలు అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు అమిత్ షా. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వాల్సిన హామీలపై చర్చించనున్నారు. ప్రచార వ్యూహాలకు పదును పెట్టనున్నారు. ఈ సమావేశంలో… బీజేపీ ఎన్నికల ప్యానెల్ చీఫ్…ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్, బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్, బీజేపీ యూపీ ఇన్‌ఛార్జి రాధా మోహన్ సింగ్ తదితరులు ..పాల్గొంటారు.
Read More : Corona Restrictions : దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్..కరోనా ఆంక్షలు మరోసారి పొడిగింపు
2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు కైవసం చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 47, కాంగ్రెస్ 7 స్థానాలను గెల్చుకుంది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో మరింత మెజార్టీ సాధించే దిశగా అమిత్ షా వ్యూహ రచన చేస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతోంది. యూపీ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువమందికి టికెట్లు దక్కవని ప్రచారం జరుగుతోంది. దీంతో.. అమిత్ షా లక్నో పర్యటన బీజేపీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 80 సీట్లకు 64 స్థానాలను గెల్చుకుంది కమలదళం. ఇంతటి ఘన విజయం వెనుక అమిత్ షా వ్యూహాలున్నాయి. దాంతో పాటే పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల వ్యూహాలూ కలిసొచ్చాయి. నాడు…సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీ పొత్తు ఉన్నప్పటికీ…బీజేపీ ఘన విజయం సాధించింది.