Israel-Gaza war: యుద్ధంలో భారతీయురాలికి తీవ్ర గాయాలు.. తల్లికి ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా?

ఫోను ఒక్కసారిగా కట్ కావడం, పెద్ద శబ్దాలు రావడంతో ఆమె భర్త కంగారుపడ్డాడు.

Israel-Gaza war: యుద్ధంలో భారతీయురాలికి తీవ్ర గాయాలు.. తల్లికి ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా?

Kerala woman

Kerala woman: ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో ఓ భారతీయురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఇజ్రాయెల్‌లో ఏడేళ్లుగా నర్సుగా పనిచేస్తున్న కేరళకు చెందిన ఓ మహిళ తన భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడుతుండగా ఆమె ఉన్న ప్రాంతంలో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ వేసిన ఓ బాంబు పేలింది.

దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఫోను ఒక్కసారిగా కట్ కావడం, పెద్ద శబ్దాలు రావడంతో ఆమె భర్త కంగారు పడ్డాడు. బాధిత నర్సు పేరు షీజా ఆనంద్‌ (41) అని అధికారులు తెలిపారు. ఆమెను ఆసుపత్రికి తరలించిన వైద్యులు ఓ సర్జరీ కూడా చేశారు. ఆసుపత్రి బెడ్ పై నుంచి షీజా ఆనంద్ కేరళలోని తన తల్లికి ఫోన్ చేసింది.

‘అమ్మా నేను క్షేమంగానే ఉన్నా’నని తెలిపింది. షీజాను మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఆమె స్నేహితులు తెలిపారు. షీజా భర్త ఆనంద్ మహారాష్ట్రలో పనిచేస్తున్నారు. వారి పిల్లలు ఆయనతోనే ఉంటూ చదువుకుంటున్నారు. షీనా సోదరి మీడియాతో మాట్లాడుతూ… షీనా సహోద్యోగులు తమకు ఫోన్ చేసి.. బాంబు దాడిలో ఆమె గాయపడిందని చెప్పారని తెలిపింది.

షీనాకు వెన్నెముక శస్త్రచికిత్స జరగాల్సి ఉందని తమకు తెలిసిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. షీనా కాళ్లు, చేతులకు మాత్రమే గాయాలయ్యాయని మొదట అనుకున్నామని, ఆమె వెన్నెముక కూడా దెబ్బతిందని తెలిసిందని చెప్పారు. కాగా, ఇజ్రాయెల్ లో 18,000 మంది భారతీయులు ఉన్నారు.

Israel : ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై హమాస్ మిలిటెంట్ల దాడి, 260 మృతదేహాలు లభ్యం