Amul: మళ్లీ పాల ధరలు పెంచిన అమూల్.. ఒక్క గుజరాత్‭లో మాత్రం మినహాయింపు

ఆగస్టులో లీటర్ మీద 2 రూపాయలు ధర పెంచింది అమూల్. పాల సేకరణ, ఇతర ఇన్ ఫుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా ఈ ధరలను పెంచుతున్నట్లు అప్పట్లో కంపెనీ ప్రకటించింది. గత ఐదు నెలల్లో కంపెనీ ఇన్ ఫుట్ ఖర్చులు భారీగా పెరగడం వల్ల ధరల పెంపు తప్పడం లేదని మదర్ డెయిరీకి చెందిన ఓ అధికారి ఓ జాతీయ వార్తా సంస్థకు వెల్లడించారు. అంతకు ముందు మార్చిలో కూడా పాల ధరను లీటరుకు రూ. 2 చొప్పున పెంచింది అమూల్ కంపెనీ

Amul: మళ్లీ పాల ధరలు పెంచిన అమూల్.. ఒక్క గుజరాత్‭లో మాత్రం మినహాయింపు

Amul milk price hiked by Rs 2 per litre ahead of Diwali

Updated On : October 15, 2022 / 7:22 PM IST

Amul: రెండు నెలల క్రితమే దేశ వ్యాప్తంగా పాల ధరలు పెంచిన ప్రముఖ పాల బ్రాండ్ అమూల్.. తాజాగా మరోసారి పాల ధరలు పెంచింది. తాజాగా పెంచిన ధరలు ఒక్క గుజరాత్ మినహా దేశమంతటికీ వర్తిస్తాయని అమూల్ శనివారం ప్రకటించింది. ఒక్కో లీటరుపైన 2 రూపాయల ధర పెంచారు. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ ఆర్ఎస్ సోధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అమూల్ బ్రాండ్ కింద అమూల్ ఉత్పత్తులను గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ చేస్తోంది. పెరిగిన ధరల ప్రకారం ఫుల్ క్రీమ్ ధర రూ.61 నుంచి రూ.63కు పెరిగింది. గోల్డ్, బఫెలో మిల్క్‌ను కూడా రూ.2 పెంచింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న గుజరాత్‌లో మాత్రం ధరలు పెంచకపోవడం గమనార్హం.

ఇక ఆగస్టులో లీటర్ మీద 2 రూపాయలు ధర పెంచింది అమూల్. పాల సేకరణ, ఇతర ఇన్ ఫుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా ఈ ధరలను పెంచుతున్నట్లు అప్పట్లో కంపెనీ ప్రకటించింది. గత ఐదు నెలల్లో కంపెనీ ఇన్ ఫుట్ ఖర్చులు భారీగా పెరగడం వల్ల ధరల పెంపు తప్పడం లేదని మదర్ డెయిరీకి చెందిన ఓ అధికారి ఓ జాతీయ వార్తా సంస్థకు వెల్లడించారు. అంతకు ముందు మార్చిలో కూడా పాల ధరను లీటరుకు రూ. 2 చొప్పున పెంచింది అమూల్ కంపెనీ. ఈ యేడాదిలో ఇప్పటికే మూడుసార్లు పాల ధరలు పెంచిన అమూల్.. సామాన్యుడిపై ధరల మోత మోగిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

APJ Abdul Kalam: ఆ హెచ్చరికలతోనే 2014లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన మాజీ రాష్ట్రపతి కలాం