Anand Mahindra : మహిళ క్రియేటివిటీ నచ్చి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్ర

వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటమే కాదు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోత్సాహం అందిస్తారు. తాజాగా ఓ మహిళ క్రియేటివిటీ నచ్చి ఆమెకు జాబ్ ఆఫర్ చేసారాయన.

Anand Mahindra  : మహిళ క్రియేటివిటీ నచ్చి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్ర

Anand Mahindra

Updated On : July 9, 2023 / 11:39 AM IST

Anand Mahindra : స్టెప్లర్ పిన్‌ల సాయంతో చక్రాలు, బోనెట్, రూఫ్ మొత్తం బాడీతో కూడిన చిన్న కారును క్రియేట్ చేసింది ఓ మహిళ. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆమె క్రియేటివిటీ నచ్చడంతో జాబ్ ఆఫర్ చేశారు.

Mumbai : వర్షంలో ‘రిమ్‌జిమ్ గిరే సావన్’ పాట ఫ్రేమ్ బై ఫ్రేమ్ రిక్రీయేట్ చేసిన వృద్ధ జంట .. ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా

వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాదు క్రియేటివిటీని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. తాజాగా స్టెప్లర్ పిన్‌ల సాయంతో ఓ మహిళ తయారు చేసిన కారు వీడియో ఆయనను ఆకర్షించింది. ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోలో ఆమె చక్రాలు, బోనెట్, పైకప్పు కారు బాడీ తయారు చేయడానికి కొన్ని సెట్ల పిన్స్‌ను జత చేసింది. ‘కేవలం సాధారణ స్టెప్లర్ పిన్స్ ఉపయోగించి కారు తయారు చేయాలనే ఆలోచన ఆమెకు ఎలా వచ్చింది? ఆమె క్రియేటివిటీ నమ్మశక్యంగా లేదు. ఆమె నిజంగానే ఈ పనితనం కార్ల తయారీ, డిజైన్లపై చేయగలిగితే తప్పకుండా ఆమెను రిక్రూట్ చేసుకుంటాం’ అంటూ ఆనంద్ మహీంద్ర ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Anand Mahindra : వర్షం ఎంజాయ్ చేస్తున్న బుడ్డోడు.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్

అందరూ ఆమెలోని క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు. ‘ఒరిజినల్ క్రియేటివిటీ’ అని.. ‘అద్భుతం’ అని అభిప్రాయపడ్డారు. ఇక ఈ ట్వీట్ ఆ మహిళకు చేరిందో లేదో కానీ టాలెంట్ ఎక్కడ ఉన్నా వారిని ఆనంద్ మహీంద్ర పోత్సహిస్తారనడానికి ఈ పోస్టు ఉదాహరణగా నిలిచింది.