Mumbai : వర్షంలో ‘రిమ్జిమ్ గిరే సావన్’ పాట ఫ్రేమ్ బై ఫ్రేమ్ రిక్రీయేట్ చేసిన వృద్ధ జంట .. ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా
ఎక్కడ పడితే అక్కడ రీల్స్, వీడియోలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇప్పుడు యూత్ పని. ఇందులో మేమేం తక్కువ అంటున్నారు పెద్దవాళ్లు సైతం. ముంబయి వర్షంలో తడుస్తూ 'రిమ్జిమ్ గిరే సావన్' పాటని రీక్రియేట్ చేశారు ఓ వృద్ధ జంట.. వీరి వీడియోపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Mumbai
Mumbai : వర్షాకాలం రాగానే వానపాటలు గుర్తొస్తాయి. 1979 లో రిలీజైన మంజిల్ సినిమాలోని ‘రిమ్ జిమ్ గిరే సావన్’ పాట ఎంత సూపర్ హిట్ అనేది అందరికీ తెలిసిందే. ఈ పాటని వర్షంలో ఫ్రేమ్ బై ఫ్రేమ్ రీక్రియేట్ చేసింది ఓ వృద్ధ జంట. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర మనసు దోచుకుంది. ఆయన కూడా వీడియోపై ట్వీట్ చేశారు.
Mumbai : ముంబయిలో భారీగా క్యూ కట్టిన ప్రజలు .. దేని కోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ముంబయిలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఈ వర్షాల్లో కూడా రీల్స్, వీడియోలు చేసేవారు ఏ మాత్రం తగ్గట్లేదు. పెద్దవాళ్లు కూడా ఏ మాత్రం తీసిపోకుండా వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ వృద్ధ జంట మంజిల్ సినిమాలోని వాన పాటను అద్భుతంగా రీక్రియేట్ చేశారు. 1979 లో వచ్చిన మంజిల్ సినిమాలోని ‘రిమ్జిమ్ గిరే సావన్’ పాటపై వీడియో చిత్రీకరించారు. అమితాబ్ బచ్చన్, మౌసమి ఛటర్జీలపై చిత్రీకరించబడిన ఈ వానపాటలో నటించి వృద్ధ జంట అలరించారు. అరుణ్ పనికర్ (Arun Panicker) అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపించిన జంట శైలేష్ ఇనామ్ దార్, భార్య వందన. కాగా వీడియోను వారి స్నేహితులు అనూప్ రింగంగావ్కర్ ఆయన భార్య అంకిత షూట్ చేశారట.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘చాలా నేచురల్‌గా వీడియో తీశారు..సాధారణమైన జీవితాన్ని పాటలో చక్కగా చూపించారు’ అని ఒకరు.. ‘లవ్లీ.. ఇది నా ఫేవరెట్ పాత బాంబే మాన్సూన్ సాంగ్’ అంటూ మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు. మొత్తానికి యూత్ మాత్రమే కాదు.. ఇలాంటి వీడియోల్లో నటించి మేము కూడా మెప్పించగలమని పెద్దవారు సైతం సై అంటున్నారు.
ఈ వీడియోపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం స్పందించారు. ‘నేను ఈ జంటను అభినందిస్తున్నాను. మీరు మీలోని ఊహా శక్తిని బయటకు తీస్తే మీరు కోరుకున్న జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చని మాకు చెబుతున్నారు’ అంటూ వారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
Anand Mahindra : వర్షం ఎంజాయ్ చేస్తున్న బుడ్డోడు.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్
Kudos to this couple for recreating Rim Jhim gire sawan. I had a huge grin on my face all through. #whatsappforward pic.twitter.com/6f7SAiqYk5
— Arun Panicker (@panix68) July 2, 2023
This is justifiably going viral. An elderly couple re-enact the popular song ‘Rimjhim gire sawan’ at the very same locations in Mumbai as in the original film. I applaud them. They’re telling us that if you unleash your imagination, you can make life as beautiful as you want it… pic.twitter.com/wO7iJ3da3m
— anand mahindra (@anandmahindra) July 2, 2023