Anand Mahindra: ప్రకృతి పగతీర్చుకుంటుంది.. ఎప్పటికీ క్షమించదు.. ఆసక్తికర వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహింద్రా
పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. తరచు తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలను పోస్టు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంటారు.

anand mahindra
Anand Mahindra: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. తరచు తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలను పోస్టు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంటారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ తన తాజా ట్వీట్‌లో ప్రకృతి మానవులపై ప్రతీకారం తీర్చుకుంటుంది అని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
ముగ్గురు వ్యక్తులు అడవిలో ఒక పెద్ద చెట్టును నరికివేయడంలో విజయం సాధించారు. దానిని నరికిన తర్వాత చైన్ సహాయంతో ముగ్గురు వ్యక్తులు చెట్టును కిందకు నెట్టే ప్రయత్నం చేస్తారు. అయితే.. ఆ చెట్టు మొదలు వేగంగా వచ్చి ముగ్గురిలో ఒక వ్యక్తిని బలంగా ఢీకొనడంతో అతడి పైకెగిరి కిందపడిపోయినట్లు వీడియోలో కనిపిస్తుంది.
If you cut down trees, they won’t take it lying down ??????pic.twitter.com/TekNZiQSTF
— anand mahindra (@anandmahindra) August 23, 2022
ఈ వీడియోను షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 630,000 కంటే ఎక్కువ మంది నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు.. ఆనంద్ మహింద్రా వ్యాఖ్యలకు మద్దతుగా.. “ప్రకృతి ఎప్పటికీ మరచిపోదు, క్షమించదు” అని రీ ట్వీట్లు చేశారు. ఓ నెటిజన్.. ప్రకృతి ఎవరినీ వదలదు, ఇది ఒక ఉదాహరణ అంటూ వ్రాశాడు.