Anand Mahindra: ఒకే ఒక్క ఫొటో పోస్ట్ చేసి.. అందరినీ ఆలోచింపజేసిన ఆనంద్ మహీంద్ర

రహదారిపై ట్రాఫిక్ లైట్ వద్ద తన కారు ఉన్న సమయంలో అందులో నుంచి ఆనంద్ మహీంద్రా ఈ ఫొటో తీశారు.

Anand Mahindra: ఒకే ఒక్క ఫొటో పోస్ట్ చేసి.. అందరినీ ఆలోచింపజేసిన ఆనంద్ మహీంద్ర

Anand Mahindra

Updated On : January 8, 2025 / 9:49 AM IST

సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర. ఆయన ఎక్స్‌లో చేసే పోస్టులు అందరినీ ఆలోచింపజేస్తుంటాయి. తాజాగా, ఆనంద్ మహీంద్ర మరో పోస్ట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు.

రహదారిపై ట్రాఫిక్ లైట్ వద్ద తన కారు ఉన్న సమయంలో అందులో నుంచి ఆనంద్ మహీంద్రా ఈ ఫొటో తీశారు. రోడ్డుపై ఓ వ్యక్తి బైకుపై వెళ్తున్నాడు. ఆ బైకు వెనకాల కూర్చున్న వ్యక్తి శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని పట్టుకున్నాడు. ఆ బైక్‌ నడుపుతున్న వ్యక్తికి ఓ పక్క భక్తి భావం ఉంది కానీ, ట్రాఫిక్ రూల్స్‌ మాత్రం పాటించడంలేదు. ఆ బైకుపై ఉన్న వ్యక్తి హెల్మెట్‌ పెట్టుకోలేదు.

ఈ విషయాలన్నింటినీ గుర్తించిన ఆనంద్ మహీంద్ర దీనిపై స్పందిస్తూ.. “ట్రాఫిక్ లైట్‌ పడిన సమయంలో ఈ ఫొటోని చివరి క్షణంలో తీయగలిగాను. దేవుళ్లు మనల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అయినప్పటికీ, హెల్మెట్ ధరించడం మంచిది” అని పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ట్వీట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

“హెల్మెట్లు పెట్టుకోరు, తోటివారికి ఇబ్బందులు కలిగిస్తారు. కానీ, దేవుడికి మాత్రం మొక్కుతుంటారు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మనం ప్రమాదాలు కోరి తెచ్చుకుంటే మనల్ని దేవుడు కూడా కాపాడలేడని కొందరు కామెంట్లు చేశారు.

HMPV virus cases: హెచ్‌ఎంపీవీ కేసులపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం