చార్‌థామ్ దేవాలయాలకు అంబాని రూ.5కోట్లు విరాళం

  • Published By: nagamani ,Published On : October 9, 2020 / 10:41 AM IST
చార్‌థామ్ దేవాలయాలకు అంబాని రూ.5కోట్లు విరాళం

Updated On : October 9, 2020 / 10:55 AM IST

ఉత్తరాఖండ్‌లోని ప్రతీష్టాత్మక చార్‌థామ్ దేవస్థానం బోర్డుకు ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఈ సంవత్సరం చార్‌థామ్ దేవాలయాలు మూసివేశారు. దీంతో భక్తులు రాక విరాళాలు రాక..చార్ థామ్ దేవాలయాల ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో దేవస్థానం బోర్డు ఉంది.




దీంతో దేవాలయాల అదనపు సీఈవో సింగ్ ఈ విషయాన్ని ముఖేష్ అంబానీకి విజ్ఞప్తి చేశారు. దేవస్థానం బోర్డుకు సహకరించాలని విజ్ఞప్తి చేయగా అంబానీ స్పందించారు. ఈక్రమంలో రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు..జియో ప్లాట్ ఫామ్స్ బోర్డు అదనపు డైరెక్టర్ అయిన అనంత్ అంబానీ చార్ ధామ్ దేవస్థానం బోర్డుకు రూ.5 కోట్లు విరాళం అందజేశారు.


ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ డివిజన్ కమిషనర్, బోర్డు సీఈఓ రవీనాథ్ రామన్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ తో దేవాలయాలు మూసివేయటంతో ఉద్యోగుల జీతాలు చెల్లించడం..ఆలయాల మౌలిక సదుపాయాలు..యాత్రికులకు సౌకర్యాలు పెంచడం కోసం అంబానీలు బోర్డుకి సహాయం అందించాలని సింగ్ అభ్యర్థించామనీ..వెంటనే స్పందించి విరాళం అందించిన అంబానీ కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు సదా తోడుగా ఉంటాడని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.


కాగా..గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించుకొని రావటాన్ని ‘చార్‌ధామ్‌ యాత్ర’ అంటారు. ఈ ఆలయాల ద్వారాలు ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి నవంబర్‌లో దీపావళి పర్వదినం తర్వాత మూసివేస్తారు. జీవిత కాలంలో ఒక్కసారైనా చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లాలని హిందువులు భావిస్తారు.


ఇదిలా ఉండగా.. తాజాగా ఫోర్బ్స్ వెలువరించిన అత్యంత ధనికుల జాబితాలో అంబానీ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ముకేశ్ అంబానీ రూ.6.45 లక్షల కోట్ల ఆస్తితో మొదటిస్థానంలో ఉండగా.. మరో వ్యాపారవేత్త గౌతం అదానీ రూ.1.83 లక్షల కోట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.