Love Marriage : వివాహానికి అడ్డొచ్చిన కులం.. పెళ్లైన మూడు నెలలకే పరువు హత్య

ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై యువతి కుటుంబ సభ్యులు కక్షకట్టారు. పెళ్ళై మూడు నెలలు గడవకముందే యువతి తరపు వారు యువకుడిని హత్యచేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Love Marriage : వివాహానికి అడ్డొచ్చిన కులం.. పెళ్లైన మూడు నెలలకే పరువు హత్య

Love Marriage

Love Marriage : ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై యువతి కుటుంబ సభ్యులు కక్షకట్టారు. పెళ్ళై మూడు నెలలు గడవకముందే యువతి తరపు వారు యువకుడిని హత్యచేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనీష్ కుమార్ చౌదరి అనే యువకుడు, దీప్తి మిశ్రా అనే యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమకు పెళ్లి చేయాలనీ కుటుంబ సభ్యులను కోరారు. ఇరువురి కులాలు వేరుకావడంతో యువతి కుటుంబ సభ్యులు పెళ్ళికి ఒప్పుకోలేదు. ఇక అనీష్ కుటుంబ సభ్యులు మొదట ఒప్పుకోలేదు ఆ తర్వాత ఎలాగోలా చేసి వారిని ఒప్పించాడు.

The full story of the daylight murder of a Dalit Panchayat officer who married a Brahmin girl - Ground report from Gorakhpur » Press24 News English

అనంతరం ఇరువురు పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు వారిని విడదీసేందుకు అనేక సార్లు ప్రయత్నించారు. పొలిసు కేసు పెట్టి ఒత్తిడి చేశారు. కానీ ఆ జంట విడిపోయేందుకు ఒప్పుకోలేదు ఈ నేపథ్యంలోనే యువకుడిపై పగపెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు జులై 24న అనీష్ హత్యకు ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే నడిరోడ్డుపై అనీష్ ను హత్యచేశారు. ఈ ఘటన గోరఖ్ పూర్ జిల్లాలో సంచలనంగా మారింది. హత్యకేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు 17 మందిపై కేసు నమోదు చేశారు. 8 మందిని జైలుకు పంపగా మిగిలిన వారిని విచారిస్తున్నారు.

The full story of the daylight murder of a Dalit Panchayat officer who married a Brahmin girl - Ground report from Gorakhpur » Press24 News English

కాగా దీప్తి సోషియాలజీలో ఎంఏ చేయగా.. అనీష్ యాన్సియంట్ హిస్టరీలో ఎంఏ చేశాడు. అనీష్, దీప్తి ఇద్దరూ గ్రామ పంచాయతీ అధికారులుగా ఉద్యోగాలు సాధించారు. ఇద్దరికి కౌదిరమ్ బ్లాక్‌లో పోస్టింగ్ ఇచ్చారు. మూడేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నారు.. ఈ తరుణంలోనే వారిమధ్య ప్రేమ పుట్టింది. ఇది చివరకు విషాదంగా ముగిసింది. పెళ్ళైన మూడు నెలలకే భర్తను కోల్పోవడంతో దీప్తి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కట్టుకున్న వాడిని కన్నవారు కడతేర్చడంతో దిక్కుతోచని స్థితిలో పడింది దీప్తి.