రాఫెల్ డీల్‌పై రాహుల్ ఎటాక్ : అంబానీ ‘పేపర్ ప్లేన్’ కూడా చేయలేడు

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ తమ ఎజెండాకు సంబంధించి ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. అధికార పక్షమే లక్ష్యంగా విపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి.

  • Published By: sreehari ,Published On : March 12, 2019 / 01:10 PM IST
రాఫెల్ డీల్‌పై రాహుల్ ఎటాక్ : అంబానీ ‘పేపర్ ప్లేన్’ కూడా చేయలేడు

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ తమ ఎజెండాకు సంబంధించి ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. అధికార పక్షమే లక్ష్యంగా విపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ తమ ఎజెండాకు సంబంధించి ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. అధికార పక్షమే టార్గెట్ గా విపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఈ తరుణంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం రాహుల్ గుజరాత్ లోని గాంధీనగర్ లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్.. మోడీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రధాన విమర్శనాస్త్రం రాఫెల్ ఫైటర్ జెట్ డీల్ పై రాహుల్ ఆరోపణలు గుప్పించారు.
Read Also : బాలాకోట్ దాడులపై యోగి సంచలన వ్యాఖ్యలు

రాఫెల్ డీల్ విషయంలో ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీపై కూడా రాహుల్ ధ్వజమెత్తారు. ఫ్రాన్స్ తో 36 రాఫెల్ ఫైటర్ జెట్ కొనుగోలు ఒప్పందం విషయంలో పీఎం మోడీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాఫెల్ డీల్ కోసం తన స్నేహితుడు అనిల్ అంబానీకి (రిలయన్స్ డిఫెన్స్ సంస్థ) మోడీ రూ.30వేల కోట్లు కట్టబెట్టారని రాహుల్ ఆరోపించారు. పాకిస్థాన్ భూభాగంలో వైమానిక దాడులు జరిపిన ఐఏఎఫ్ బలగాలను మోడీ మెచ్చుకుంటున్నారని, వారి జేబుల్లో నుంచి రూ.30వేల కోట్లు కొట్టేసి అనిల్ అంబానీకి ఇచ్చిన విషయం మోడీ చెప్పరని రాహుల్ ఆరోపించారు. అనిల్ అంబానీపై కూడా మోడీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దివాలా తీసిన అంబానీ.. ఒక పేపర్ ప్లేన్ కూడా చేయలేరని ఎద్దేవా చేశారు. 

వచ్చే లోక్ సభ 2019 ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ కు సానుకూలంగా ఉంటాయని అన్నారు. ఒక్క గుజరాత్ లోనే కాదు.. దేశీయ స్థాయిలో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రానున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, దేశంలోని యువకులకు ఉద్యోగాలను కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రాహుల్ విమర్శించారు. కాగా, గుజరాత్ లో కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీ సందర్భంగా రాహుల్ గాంధీని పాటీదార్ ఆందోళన సమితి నాయకుడు హర్దీక్ పటేల్ కలిశారు. ఈ సందర్భంగా రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Read Also : మంగళగిరిలో నోట్లకట్టల కలకలం : కారులో రూ.80 లక్షలు