Odisha Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం ఎఫెక్ట్.. పలువురు అధికారులు బదిలీ.. సౌత్ ఈస్టర్న్ నూతన జీఎంగా అనిల్ కుమార్ మిశ్రా నియామకం

బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన కొన్ని వారాల తరువాత సౌత్ ఈస్టర్న్ రైల్వేకు నూతన జనరల్ మేనేజర్‌గా అనిల్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు.

Odisha Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం ఎఫెక్ట్.. పలువురు అధికారులు బదిలీ.. సౌత్ ఈస్టర్న్ నూతన జీఎంగా అనిల్ కుమార్ మిశ్రా నియామకం

Odisha Train Accident (File Photo)

Updated On : July 1, 2023 / 7:21 AM IST

Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం  జరిగిన కొన్ని వారాల తరువాత సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railway) కు నూతన జనరల్ మేనేజర్ (General Manager ) నియమితులయ్యారు. ప్రస్తుతం జీఎంగా కొనసాగుతున్నఅర్చన జోషి సహా ఆరుగురు సీనియర్ అధికారులపై రైల్వే బోర్డు (Railway Board) బదిలీ వేటు వేసింది. కేబినెట్ నియామకాల కమిటీ శుక్రవారం రైల్వే బోర్డు సిఫారసు మేరకు ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అధికారి అనిల్ కుమార్ మిశ్రా (Anil Kumar Mishra) ను జనరల్ మేనేజర్‌గా నియమించింది. అర్చన జోషి (Archana Joshi) కర్ణాటకలోని యలహంకలోని రైల్‌వీల్ ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్‌గా బదిలీ అయ్యారు. రైల్వే బోర్డు గతంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డివిజనల్ రైల్వే మేనేజర్ సహా ఐదుగురు సీనియర్ జోన్ అధికారులను బదిలీ చేసింది.

Maharashtra Bus Catches Fire : మహారాష్ట్ర బస్సులో మంటలు..25మంది మృతి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో జూన్ 2వ తేదీన మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 293 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తరువాత రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రమాద ఘటనపై విచారణకు రైల్వే బోర్డు కమిటీని నియమించింది. రైల్వే సేప్టీ కమిషన్ (సీఆర్ఎస్) విచారణ నివేదికను గురువారం రైల్వే బోర్డుకు సమర్పించినట్లు తెలిసింది. అయితే, నివేదికలో వెల్లడైన విషయాలను బహిర్గతం చేసేందుకు రైల్వే బోర్డు సీనియర్ అధికారులు నిరాకరించారు. ప్రమాదంపై సీఆర్ఎస్‍‌తో పాటు సీబీఐ కూడా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

Another rail accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ప్రమాదం జరిగినప్పటి నుండి రైల్వే శాఖ ఆగ్నేయ రైల్వేకు చెందిన పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. మరోవైపు సీబీఐ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి విప్లవ్ కుమార్ చౌదరి పదవీకాలాన్ని పొడిగించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. సీబీఐలో జాయింట్ డైకెక్టర్‌గా పనిచేస్తున్న, ప్రస్తుతం బాలాసోర్ రైలు ప్రమాదంలో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న విప్లవ్ కుమార్ చౌదరి పదవీకాలాన్ని ఏడాదిన్నర పొడిగించినట్లు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వుల్లో తెలిపింది.