ఇంటి అద్దె కట్టలేదని చావబాదిన పోలీస్, మనస్తాపంతో ఆత్మహత్య

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఇంటి అద్దె కట్టలేదని ఓ వ్యక్తిని పోలీసు చావబాదాడు. దీంతో మనస్తాపం చెందిన బాధితుడు అవమాన భారంతో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలతో అతడు చనిపోయాడు. బాధితుడి పేరు శ్రీనివాసన్. వినయాగపురంలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా క్రాంటాక్ట్ పద్ధతిలో పెయింటర్‌గా పని చేస్తాడు.
4 నెలలుగా ఇంటి అద్దె కట్టడం లేదు:
కాగా, కరోనా లాక్‌డౌన్ కారణంగా అతని ఉపాధి దెబ్బతింది. జాబ్ పోయింది. ఇల్లు గడవటం కష్టంగా మారింది. తినడానికి తిండి కూడా లేదు. ఈ పరిస్థితుల్లో 4 నెలలుగా అతడు ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాడు. కాగా, ఆ ఇంటి ఓనర్ రాజేంద్రన్ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. శ్రీనివాసన్ ఇంటి అద్దె కట్టడం లేదని ఇంటి యజమాని రాజేంద్రన్ పుజల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఎస్ఐ బెన్సమ్, పెయింటర్ శ్రీనివాసన్ ఇంట్లోకి దూసుకెళ్లాడు. అతడిని చావబాదాడు. రెంట్ ఎందుకు కట్టలేదని తీవ్రంగా కొట్టాడు.