మార్పు మంచిదే : దీపావళికి చైనాకు షాకిస్తున్న తెలుగు రాష్ట్రాలు 

  • Published By: veegamteam ,Published On : October 25, 2019 / 04:19 AM IST
మార్పు మంచిదే : దీపావళికి చైనాకు షాకిస్తున్న తెలుగు రాష్ట్రాలు 

Updated On : October 25, 2019 / 4:19 AM IST

దీపావళి వేడుకకు తెలుగు రాష్ట్రాల ప్రజలు రెడీ అయిపోయారు. దీపావళి సంబరంమంటే టపాసులే. దీపావళికి  టపాసులు కొనటానికి సందడి మొదలైంది. మట్టి ప్రమిదలతో పాటు రంగు రంగులతో వెరైటీ దీపాలు మార్కెట్ లో ఆకట్టుకుంటున్నాయి. ఈ దీపావళికి మరో విశేషముంది. విదేవీ వస్తువులపై తెలుగు ప్రజలు మొఖం చాటేశారు. స్వదేశీ ప్రొడక్ట్స్ పైనే మక్కువ చూపుతున్నారు. చైనా టపాసులు కొనటానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపటంలేదు. 

ముఖ్యంగా తమిళనాడులోని శివకాశి నుంచీ పెద్ద సంఖ్యలో బాణసంచా రకాలు తెలుగు రాష్ట్రాలకు వచ్చాయి. ప్రతీ దీపావళికి  చైనా నుంచీ  భారీ ఎత్తున ఉత్పత్తులు మార్కెట్లను ముంచెత్తేవి. వ్యాపారులు కూడా ఆర్టర్లు ఇచ్చి చైనా నుంచి పెద్ద ఎత్తున బాణసంచా తెప్పించుకునేవారు. భారీ లోహకాలు ఉన్న బాణసంచాలు కాల్చవద్దని  సుప్రీంకోర్టు సూచనల మేరకు ప్రజలు చైనా వస్తువుల్ని కొనేందుకు ఆసక్తి చూపటం లేదు. దీంతో వ్యాపారులు కూడా చైనా బాణసంచా కోసం ఆర్డర్లు పంపటంలేదు. 

అలాగే దీపావళికి మహిళలు బొమ్మల కొలువు పెట్టుకునే సంప్రదాయం ఉంది. బొమ్మల కొనుగోలు విషయంలో మహిళలు విదేశీ విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమల్ని కొనేందుకు  ఆసక్తి చూపించట్లేదు. దేశీయంగా తయారైన పర్యావరణ హితమైన మట్టితో తయారయ్యేవే ఎక్కువగా కొంటున్నారు. 

లక్ష్మీదేవి, దుర్గాదేవి, వినాయకుడు, సరస్వతి దేవి, శివుడి ప్రతిమలు చైనా నుంచీ పెద్ద మొత్తంలో దిగుమతి అయ్యేవి. గత కొంత కాలం నుంచి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. స్థానికంగా తయారయ్యేవే ప్రజలకు నచ్చుతున్నాయి.

అందువల్ల చైనా మార్కెట్ అడ్డంగా పడిపోయింది. గతంలో చైనా నుంచి వచ్చి  ఈ విగ్రహాలకు మంచి డిమాండ్ ఉండేది. ఆయా దేవుడు విగ్రహాలు తయారు చేయటంలో చైనా కళాకారులు మంచి ప్రతిభ కనబరిచేవారు. విగ్రహాల తయారీకి టెక్నాలజీని వినిగించేవారు. దీంతో  చక్కటి రూపు రేఖలతో ఉండే చైనా విగ్రహాలను కొనేందుకు ఆసక్తి చూపే ప్రజలు ప్రస్తుతం స్వదేశీ విగ్రహాలనే కొంటున్నారు. ఇప్పుడా టెక్నాలజీ ఇండియా కళాకారులు చేస్తున్నారు. దీంతో చైనా విగ్రహాలపై ఆసక్తి పోయి  ఇండియాలో తయారయ్యే విగ్రహాలను ప్రజలు ఎక్కువగా కొంటున్నారు. దీంతో చైనా విగ్రహాలు మార్కెట్ 80 శాతం నుంచి 10 శాతానికి పడిపోయిందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.