Supreme Court: రాజకీయ పార్టీల ఖర్చులను పరిమితం చేయాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన అనంతరం సుప్రీకోర్టు ఏం చెప్పిందంటే?

ఎన్నికల పిటిషన్లను ఆరు నెలల్లోగా పరిష్కరించేలా అన్ని హైకోర్టులను ఆదేశించాలని పిటిషన్‌పై ధర్మాసనం స్పందిస్తూ "ఇవి మేము ఆదేశాలు ఇచ్చే అంశాలు కావు. దీని కోసం ఇప్పటికే చట్టం ఉంది" అని పేర్కొంది

Supreme Court: రాజకీయ పార్టీల ఖర్చులను పరిమితం చేయాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన అనంతరం సుప్రీకోర్టు ఏం చెప్పిందంటే?

ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఖర్చుపై పరిమితులు విధించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఇది శాసన విధానానికి సంబంధించిన అంశమని కోర్టు పేర్కొంది. “ఇది శాసనపరమైన మార్పు, విధానపరమైన అంశం. అటువంటి పిటిషన్‌ను మేము స్వీకరించలేము” అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

ఖర్చు పరిమితిని అభ్యర్థులు నిర్ణయించాలి
హర్యానాకు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చుపై పరిమితి ఉండాలని, నామినేషన్‌కు ముందు ముద్రించి పోస్ట్ చేసిన కథనాలపై పరిమితి విధించాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు. అలాగే, నామినేషన్ దాఖలు సమయంలో జరిగిన ర్యాలీల ఖర్చులను లెక్కించాని కోరారు. ఎన్నికల పిటిషన్ల విచారణకు సంబంధించిన ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 86ని పిటిషనర్ ఉదహరించారు.

సుప్రీం రియాక్షన్
న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై స్పందిస్తూ.. ‘‘ఇవన్నీ శాసన విధానానికి సంబంధించిన అంశాలు’’ అని పేర్కొంది. ఎన్నికల పిటిషన్లను ఆరు నెలల్లోగా పరిష్కరించేలా అన్ని హైకోర్టులను ఆదేశించాలని పిటిషన్‌పై ధర్మాసనం స్పందిస్తూ “ఇవి మేము ఆదేశాలు ఇచ్చే అంశాలు కావు. దీని కోసం ఇప్పటికే చట్టం ఉంది” అని పేర్కొంది. రాజకీయ పార్టీల ఖర్చుపై పరిమితి లేదని పిటిషనర్ ధర్మాసనానికి తెలిపారు. “ఇది శాసన మార్పుకు సంబంధించిన అంశం. ఈ అంశంపై చట్టం చేయాలని మేము పార్లమెంటును ఆదేశించలేము” అని సీజేఐ పేర్కొన్నారు.