పేపర్ లీక్..దేశవ్యాప్తంగా ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష రద్దు

పేపర్ లీక్..దేశవ్యాప్తంగా ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష రద్దు

Updated On : February 28, 2021 / 5:08 PM IST

Army ఆర్మీలో సాధారణ సిబ్బంది(general duty personnel)ని నియమించేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షను ఆర్మీ రద్దు చేసింది. ప్రశ్నాపత్రం లీకైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం(ఫిబ్రవరి-28,2021) అధికారులు తెలిపారు. ఆర్మీ రిక్రూట్​మెంట్ ​విధానంలో అవినీతి చర్యలను భారత ఆర్మీ సహించదని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియలో నిరంతర పారదర్శకత ఉండాలనే పరీక్షను రద్దు చేసినట్లు తెలిపారు.

గత రాత్రి పూణేలోని స్థానిక పోలీసులతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ చేసి…సైనికుల నియామకం(జనరల్ డ్యూటీ) కోసం కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం సిద్ధం చేసిన ప్రశ్నపత్రం లీకేజ్ అయినట్లు గుర్తించినట్లు ఓ అధికారి తెలిపారు. ఆర్మీ పరీక్ష పేపర్ లీక్‌కు సంబంధించి పూణేలోని బారామతిలో ముగ్గురు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.