BDLతో రక్షణశాఖ ఒప్పందం..త్వరలో సైన్యంలోకి “మిలాన్-2T యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు”

శత్రు దేశాలు ప్రయోగించే క్షిపణులను నిమిషాల్లో గుర్తించి కూల్చేసే మిలాన్‌-2టీ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణుల కొనుగోలుకు భారత రక్షణ మంత్రిత్వశాఖ, ప్రభుత్వ రంగ సంస్థ-భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL​) మధ్య ఒప్పందం కుదిరింది.

BDLతో రక్షణశాఖ ఒప్పందం..త్వరలో సైన్యంలోకి “మిలాన్-2T యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు”

Milan

Updated On : March 19, 2021 / 6:38 PM IST

MILAN-2T త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసేవిధంగా రక్షణశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శత్రు దేశాలు ప్రయోగించే క్షిపణులను నిమిషాల్లో గుర్తించి కూల్చేసే మిలాన్‌-2టీ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణుల కొనుగోలుకు భారత రక్షణ మంత్రిత్వశాఖ, ప్రభుత్వ రంగ సంస్థ-భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL​) మధ్య ఒప్పందం కుదిరింది.

రూ. 1,188 కోట్లతో 4,960 మిలాన్‌-2టీ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణులను బీడీఎల్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్రాన్స్‌కు చెందిన ఢిఫెన్స్ కంపెనీ MBDA నుంచి లైసెన్స్ తీసుకొని బీడీఎల్ వీటిని ఉత్పత్తి చేస్తుందని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. మూడేళ్లలో వీటిని భారత్‌ సైన్యంలో ప్రవేశపెడతామని రక్షణశాఖ ప్రకటించింది. ఈ మిలాన్‌-2టీ క్షిపణులను భూ ఉపరితలం అదేవిధంగా వాహన ఆధారిత లాంఛర్ల నుంచి కూడా ప్రయోగించవచ్చని రక్షణశాఖ తెలిపింది.

రక్షణ పరిశ్రమ తన సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఈ ప్రాజెక్టు ఒక పెద్ద అవకామని మరియు రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని సాధించే దిశలో ఒక అడుగు అవుతుంది అని రక్షణ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.

కాగా, మిలాన్ మిస్సైల్‌ను 70వ ద‌శ‌కంలో తొలిసారి ఉత్ప‌త్తి చేశారు. మిలాన్‌-2T..రీసెంట్ వ‌ర్షెన్‌. 90వ ద‌శకంలో దీన్ని కౌంట‌ర్ వెప‌న్‌గా డెవ‌ల‌ప్ చేశారు. మిలాన్‌-2టీని టాండెమ్ వార్‌హెడ్ ఏటీజీఎం ఆయుధంగా ప‌రిగ‌ణిస్తారు. దీన్ని రేంజ్ 1850 మీట‌ర్లు.