మధ్యంతర బెయిల్ గడువు పొడిగించండి.. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటీషన్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మధ్యంతర బెయిల్ గడువు పొడిగించాలని సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటీషన్ దాఖలు చేశారు.

మధ్యంతర బెయిల్ గడువు పొడిగించండి.. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటీషన్

Arvind Kejriwal

Delhi CM Kejriwal Approach Supreme Court : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మధ్యంతర బెయిల్ గడువు పొడిగించాలని సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటీషన్ దాఖలు చేశారు. వైద్యపరమైన కారణాలతో మరో ఏడు రోజులు పాటు బెయిల్ పొడిగించాలని, పీఈటీ – సిటీ స్కాన్, ఇతర పరీక్షలు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కారణంచేత బెయిల్ గడువు పొడిగించాలని కేజ్రీవాల్ పిటీషన్ ద్వారా కోర్టును విజ్ఞప్తి చేశారు.

Also Read : Arvind Kejriwal : కేజ్రీవాల్‌ హెల్త్ పిటిషన్‌పై కోర్టులో విచారణ.. బెయిల్‌ కోసం షుగర్‌ పెంచుకుంటున్నారన్న ఈడీ!

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ నివాసంలో ఈడీ బృందం విచారణ అనంతరం ఆయన్ను అరెస్టు చేసింది. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ కు ఇటీవల సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో తీహార్ జైలు నుంచి బయటకొచ్చిన కేజ్రీవాల్ ఆప్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. జూన్1న ఏడో దశ పోలింగ్ పూర్తవుతుంది. ఆ తరువాతి రోజైన జూన్ 2న కేజ్రీవాల్ తీహార్ జైలులో లొంగిపోవాల్సి ఉంది. ఈ క్రమంలో వైద్యపరమైన కారణాలతో బెయిల్ గడువు మరో వారం రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

Also Read : విచారణకు రాలేను..! బెంగుళూరు సీసీబీకి హేమ లేఖ.. పోలీసులు ఏం చేశారంటే..?