Salary Increments : ఉద్యోగులకు శుభవార్త.. కరోనా కష్టకాలంలోనూ పెరగనున్న జీతాలు

ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి కమ్మేసింది. కరోనా కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నం అయ్యాయి. ఎన్నో కంపెనీలు ఆర్థిక నష్టాల కారణంగా మూతపడ్డాయి. ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. చాలామందికి జీతాల్లో కోత పడింది. అరకొర వేతనాలతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇదంతా కరోనా వల్లే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగాలు ఉంటే చాలని అనుకుంటున్న ఉద్యోగులకు ఇది శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే, కరోనా కష్టకాలంలోనూ వారి జీతాలు.

Salary Increments : ఉద్యోగులకు శుభవార్త.. కరోనా కష్టకాలంలోనూ పెరగనున్న జీతాలు

Salary Increments

Updated On : April 14, 2021 / 9:01 PM IST

Salary Increments : ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి కమ్మేసింది. కరోనా కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నం అయ్యాయి. ఎన్నో కంపెనీలు ఆర్థిక నష్టాల కారణంగా మూతపడ్డాయి. ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. చాలామందికి జీతాల్లో కోత పడింది. అరకొర వేతనాలతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇదంతా కరోనా వల్లే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగాలు ఉంటే చాలని అనుకుంటున్న ఉద్యోగులకు ఇది శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే, కరోనా కష్టకాలంలోనూ వారి జీతాలు పెరగనున్నాయి. ఈ మేరకు ఓ సంస్థ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు:
ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశగా అడుగులు వేస్తుండటంతో, లాభాలు రావడం, మెరుగైన వృద్ధి కారణంగా ఈ ఏడాది(2021) తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం ద్వారా వేతనాలు పెంచేందుకు 59 శాతం కంపెనీలు సుముఖంగా ఉన్నట్లు స్టాఫింగ్‌ కంపెనీ జీనియస్‌ కన్సల్టెంట్స్‌ అధ్యయనం తెలిపింది. ఈ సర్వేలో 1200 కంపెనీలు పాల్గొన్నాయి. 5నుండి 10శాతం జీతాలు పెంచాలని భావిస్తున్నాయట. జీతాలు పెంచడమే కాకుండా 43శాతం కంపెనీలు కొత్త వాళ్లకి ఉద్యోగాలను ఇవ్వనున్నాయట.

ఇందులో 59శాతానికి పైగా కంపెనీలు తమ ఉద్యోగులకి జీతాలు పెంచాలని చూస్తున్నాయట. దాదాపుగా చాలా కంపెనీలు 10శాతం పెంచుతాయట. చాలా కొద్దిశాతం మాత్రమే 20శాతం జీతాలని పెంచేలా ఉన్నాయట. ఇంకా కొద్ది శాతం కంపెనీలు జీతాలు పెంచే ఆలోచనఏ చేయట్లేదట.

సర్వేలో పాల్గొన్న 1200 కంపెనీలు:
‘నియామకాలు, వలసలు, పరిహార ధోరణి 2021-22’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆన్‌లైన్‌లో 1,200 కంపెనీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించి, ఈ నివేదికను రూపొందించినట్లు జీనియస్‌ కన్సల్టెంట్స్‌ వివరించింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, నిర్మాణం, ఇంజినీరింగ్‌, విద్య/బోధన/శిక్షణ, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆతిథ్యం, హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌, ఐటీ, ఐటీఈఎస్‌, బీపీఓ, లాజిస్టిక్స్‌, తయారీ, మీడియా, చమురు-గ్యాస్‌, ఔషధ, వైద్య, విద్యుత్తు, ఇంధన, స్థిరాస్తి, రిటైల్‌, టెలికాం, వాహన, వాహన అనుబంధ రంగాల్లోని కంపెనీలను సర్వే చేసింది.

జీతాల పంపే కాదు కొత్తగా ఉద్యోగ అవకాశాలు:
కొత్త ఉద్యోగావకాశాల్లో 37 శాతం దక్షిణాదిలో లభించనున్నాయి. పశ్చిమ ప్రాంతంలో 33 శాతం నియామకాలు ఉండనున్నాయి. శ్రామిక శక్తిని బలోపేతం చేసుకునేందుకు 15 శాతం మంది కొత్త వారిని తీసుకుంటామని 21 శాతం సంస్థలు వెల్లడించాయి. 10-15 శాతం కొత్త ఉద్యోగులను తీసుకుంటామని 26 శాతం కంపెనీలు తెలిపాయి. 10 శాతం కొత్త వారిని తీసుకుంటామని 30 శాతం కంపెనీలు పేర్కొనగా, కొత్త నియామకాలు ఉండవని 23 శాతం సంస్థలు తేల్చాయి. ఉద్యోగులకు లేఆఫ్‌ ప్రకటిస్తామని 4 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. పశ్చిమ ప్రాంతంలోని కంపెనీల్లో ఎక్కువగా తొలగింపులు ఉండొచ్చు. దూర ప్రాంతం నుంచి పని వల్ల ఉత్పాదకతలో మార్పు లేదని 33 శాతం, ఒడుదొడుకులున్నాయని 37 శాతం కంపెనీలు తెలిపాయి.