Sitaram Yechury : సీపీఎం నేత సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ కరోనాతో మృతి

సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

Sitaram Yechury : సీపీఎం నేత సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ కరోనాతో మృతి

Sitaram yechury son died with corona

Updated On : April 22, 2021 / 12:43 PM IST

Sitaram yechury son died with corona : సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రెండు వారాల నుంచి కోవిడ్‌తో బాధపడుతున్న ఆశిష్… ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయారు.



కరోనాతో తన కుమారుడిని కోల్పోయినట్టు సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. రెండు వారాల క్రితం సీతారాం ఏచూరికి కరోనా సోకడంతో మొత్తం ఫ్యామిలీ ఆస్పత్రిలో చేర్పించారు. కరోనా కంట్రోల్ కాకపోవడంతో…ఆశిష్‌ను గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు.

34 ఏళ్ల ఆశిష్… ఢిల్లీలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు కరోనా బారిన పడటంతో కొన్ని రోజులుగా సీతారాం ఏచూరి కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తన కుమారుడికి చికిత్స అందించిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు సీతారాం ఏచూరి కృతజ్ఞతలు తెలిపారు.