Dress Code : ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్.. పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు

ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని విద్యా శాఖ తెలిపింది. ఆ మేరకు టీచర్స్ వస్త్రధారణ కూడా హుందాగా ఉండాల్సిన అవసరముందని తెలిపింది.

Dress Code : ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్.. పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు

Dress Code

Updated On : May 21, 2023 / 7:26 AM IST

Govt Teachers Dress Code : అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసింది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు టీ షర్ట్స్, జీన్స్, లెగ్గింగ్స్ ధరించడాన్ని నిషేధించింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని విద్యా శాఖ తెలిపింది. ఆ మేరకు టీచర్స్ వస్త్రధారణ కూడా హుందాగా ఉండాల్సిన అవసరముందని తెలిపింది. అందుకోసం ఉపాధ్యాయులు డ్రెస్ కోడ్ ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. తమ విధులు నిర్వర్తించే సమయంలో టీచర్స్ కు మర్యాదకరమైన డ్రెస్సింగ్ ఉండాలని సూచించింది.

Haryana Govt : మేకప్ వేసుకుని, నగలు ధరించి, పిచ్చి హెయిర్ స్టైల్స్‌తో ఆసుపత్రికి రావొద్దు’ డాక్టర్లకు, సిబ్బందికి ప్రభుత్వం ఆదేశం

అయితే, కొందరు ఉపాధ్యాయులు తమకు నచ్చిన దుస్తులు ధరించి పాఠశాలలకు వస్తున్నారని, కొన్నిసార్లు అది ఆమోదయోగ్యంగా అనిపించదని వెల్లడించింది. పాఠశాలల్లో విధులు నిర్వర్తించే సమయంలో ప్రొఫెషనలిజం కనబడేటట్లు వస్త్రధారణ ఉండాలని సూచించింది. క్యాజువల్స్, పార్టీ వేర్ దుస్తులకు దూరంగా ఉండాలని వెల్లడించింది.

ఇకనుంచి పురుష ఉపాధ్యాయులు ఫార్మల్ షర్ట్, ప్యాంట్, మహిళా ఉపాధ్యాయులు సల్వార్ సూట్ లేదా చీర వంటి ఫార్మల్ దుస్తులు మాత్రమే ధరించి స్కూల్స్ కు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ డ్రెస్ కోడ్ పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని విద్యా శాఖ హెచ్చరించింది.