Swift into Lamborghini: యూట్యూబ్ వీడియోలు చూసి పాత స్విఫ్ట్ కారుతో లాంబోర్గిని

కార్ అంటే ఇష్టపడని వారుంటారా.. అందులో స్పోర్ట్స్ కార్ అంటే ఇంకా పిచ్చి. కోరికలు ఉన్నాయి కదా అని కార్ ఊరికే రాదు కదా.. ఓ మాదిరి కార్ లక్షల్లో ఉంటే కోట్ల విలువ ఉండే లాంబొర్గిని స్పోర్ట్స్ కార్ ను స్విఫ్ట్ రీ డిజైన్ చేసి తయారుచేసేశాడో వ్యక్తి. అస్సాంకు చెందిన ఈ వ్యక్తి ...

Swift into Lamborghini: యూట్యూబ్ వీడియోలు చూసి పాత స్విఫ్ట్ కారుతో లాంబోర్గిని

Old Swift Lambrgini

Updated On : June 18, 2021 / 7:56 PM IST

Swift into Lamborghini: కార్ అంటే ఇష్టపడని వారుంటారా.. అందులో స్పోర్ట్స్ కార్ అంటే ఇంకా పిచ్చి. కోరికలు ఉన్నాయి కదా అని కార్ ఊరికే రాదు కదా.. ఓ మాదిరి కార్ లక్షల్లో ఉంటే కోట్ల విలువ ఉండే లాంబొర్గిని స్పోర్ట్స్ కార్ ను స్విఫ్ట్ రీ డిజైన్ చేసి తయారుచేసేశాడో వ్యక్తి. అస్సాంకు చెందిన ఈ వ్యక్తి యూట్యూబ్ వీడియోలను చూసే ఇది చేయగలిగినట్లు చెప్పాడు.

నూరుల్ హఖ్ అనే వ్యక్తి.. చేసిన ఈ పని చూసి కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. వృత్తి రీత్యా మెకానిక్ అయిన ఈ పర్సన్ కు లాంబొర్గిని స్పోర్ట్స్ కార్ సొంతం చేసుకోవడం ఓ కల. భంగా ఏరియాలో N Maruti Car Care అనే గ్యారేజి మెయింటైన్ చేస్తున్న వ్యక్తి.. తనకున్న తక్కువ సోర్స్ లతోనే ఈ సక్సెస్ సాధించాడు.

ఈ మొత్తానికి తాను ఖర్చు చేసింది కేవలం.. రూ.6.8లక్షలు మాత్రమే. ‘ఇలాంటి లగ్జరీ కార్ ను డ్రైవ్ చేయడం నా కల. లాంబొర్గినీ కార్లంటే చాలా ఇష్టం. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సక్సెస్ ను మారుతీ స్విఫ్ట్ ను మాడిఫై చేసి సాధించగలిగా’ అని ఆనందాన్ని వ్యక్తపరిచాడు.

పసుపు రంగులో మెరిసిపోతున్న మాడిఫైడ్ కార్.. అచ్ఛం లాంబొర్గినీలాగే ఉంది. కొవిడ్-19 అమల్లో ఉండటం వేరే పని చేయడానికి లేకపోవడంతో ఈ ప్రాజెక్టుపై ఫోకస్ చేసి 8నెలల్లో రెడీ చేశానని చెబుతున్నాడు. ఇక ఈ గ్యారేజికి వచ్చిన వాళ్లంతా ఆ కారుతో సెల్ఫీ దిగకుండా వెళ్లడం లేదంటే.. దాని అప్పియరెన్స్ అలా ఉంది మరి.