Amit Shah : అస్సోం – మేఘాలయ సరిహద్దు వివాదం.. అమిత్ షా సాక్షిగా ఒప్పందంపై సంతకాలు

అస్సోం - మేఘాలయ రాష్ట్రాల సరిహద్దు వివాదానికి ఒక పరిష్కారం లభించింది. గత 50 సంవత్సరాలుగా నానుతున్న ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఇరు రాష్ట్రాల..

Amit Shah : అస్సోం – మేఘాలయ సరిహద్దు వివాదం.. అమిత్ షా సాక్షిగా ఒప్పందంపై సంతకాలు

Assam And Meghalaya

Updated On : March 29, 2022 / 6:29 PM IST

Assam – Meghalaya : అస్సోం – మేఘాలయ రాష్ట్రాల సరిహద్దు వివాదానికి ఒక పరిష్కారం లభించింది. గత 50 సంవత్సరాలుగా నానుతున్న ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు Himanta Biswa Sarma, Conrad Sangmaలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈశాన్య రాష్ట్రాలకు ఇదొక చారిత్రక దినమని షా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వివాదాల్లోని 12 అంశాల్లో ఆరు పరిష్కరించబడ్డాయని, ఇది దాదాపు 70 శాతం సరిహద్దును కలిగి ఉందని.. మిలిగిన ఆరు అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించబడుతాయని షా తెలిపారు.

Read More : Galla Jayadev Demand BharatRatna : ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి- పార్లమెంటులో ఎంపీ డిమాండ్

2014 నుంచి ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి అనేక ప్రయత్నాలు ప్రధాన మంత్రి మోదీ చేయడం జరిగిందని, సమస్యల పరిష్కారానికి ఒప్పందాలపై సంతకాలు చేసిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, వారి బృందాన్ని అభినందిస్తున్నట్లు వెల్లడించారు. ఇరు రాష్ట్రాల మధ్య 884.9 కిలో మీటర్లు.. ఆరు చోట్ల (తారాబరి, గిజాంగ్, బోక్లాపరా, పిల్లంగ్ కట, రాటచెర్రా, హహీమ్) దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న వివాదాన్ని ఈ ఒప్పందం పరిష్కరిస్తుందని, 36.79 చ కి. విస్తీర్ణంలో 36 గ్రామాలున్నాయన్నారు. సరిహద్దులో మిగిలిన ఆరు ప్రాంతాల్లో నెలకొన్న వివాదాలను వచ్చే ఆరు లేదా ఏడు నెలల్లో పరిష్కరించాలని భావిస్తున్నట్లు, ఈశాన్య ప్రాంతాన్ని growth engineగా మార్చేందుకు తాము కృషి చేయడం జరుగుతుందని అస్సోం సీఎం తెలిపారు.

Read More : Aadhaar PAN Link : గడువు పొడిగించకపోతే మార్కెట్ మీద భారీ ప్రభావం పడుతుంది-సెబీకి లేఖ

ఇదొక చారిత్రకమైన రోజుగా అభివర్ణించారు సీఎం హిమంత బిశ్వశర్మ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి నిరంతర కృషి వల్లే ఈ చారిత్రకమైలురాయిని సాధించగలిగామన్నారు. ఈ ఒప్పందాన్ని మేఘాలయ సీఎం స్వాగతించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి దారి తీస్తుందని, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వారి కార్యాయాల నుంచి చాలా వత్తిడి వచ్చిందని, భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దు సమస్యలను పరిష్కరించగలిగినప్పుడు.. రెండు రాష్ట్రాలు ఎందుకు పరిష్కరించలేవన్నారు. ప్రతొక్కరూ తమవంతుగా సహకారం అందించారని తెలిపారు. 1972లో అస్సోం నుంచి మేఘాలయ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.