త్వరలో మేడిన్ ఇండియా సెక్స్ టాయ్స్

త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా(భారత్ లో తయారైన)సెక్స్ టాయ్స్ లేదా బొమ్మలు వచ్చేస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో మే 12 న ప్రధాని మోడీ టెలివిజన్ ప్రసంగం చేసే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయి ఉంది. కరోనా మహమ్మారి ఒక పెద్ద విపత్తుగా వచ్చిందని, కాని అది దానితో ఒక సందేశాన్ని మరియు అవకాశాన్ని తెచ్చిపెట్టిందని…ఆత్మనిర్భర్ భారత్ ను నిర్మించే అవకాశం వచ్చిందని చెప్పిన విషయం తెలిసిందే.
ఆత్మ నిర్భర్ భారత్ గురించి విన్నప్పుడు… ఇది అగ్ని కోసం మనకు అవసరమైన గాలి అని తాము గ్రహించామని 2012 లో భారతదేశంలో ఆన్‌లైన్ అడల్ట్ టాయ్స్ స్టోర్ IMbesharam.com వ్యవస్థాపకుడు రాజ్ అర్మానీ అన్నారు. కొన్ని నెలలుగా అర్మానీ… భారతీయుల కోసం సాంప్రదాయ అడల్ట్ టాయ్స్ తయారీ గురించి ఆలోచిస్తున్నాడు. అర్మానీకి, మోడీ ఇచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ పిలుపు అతని ఆలోచనను అమలు చేయడానికి సరైన అవకాశంగా కనిపిస్తోంది.
డిసెంబర్ నాటికి, అర్మానీ స్టోర్.. భారతదేశంలో మరియు భారతీయుల కోసం తయారుచేసిన మగ మరియు ఆడ హస్త ప్రయోగాల టాయ్స్ లేదా బొమ్మలు మార్కెట్ లోకి తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాళ్ళు మందం, రంగు మరియు ఆకృతిపై భారతదేశ ప్రాధాన్యతలను కలిగి ఉంటారు. భారతీయ పురాణాలను కొత్త అవతారంలో సజీవంగా తీసుకురావడానికి దీని బ్రాండింగ్ మన కామసూత్ర గ్రంథాలకు పర్యాయపదంగా ఉంటుంది అని అర్మానీ చెప్పారు.
ఇప్పటివరకు, భారతదేశంలో విక్రయించే సెక్స్ టాయ్స్ చాలా వరకు దిగుమతి చేయబడినవే. వాటిలో ప్రధాన భాగం చైనాలో తయారవుతుంది. ప్రపంచంలో తయారయ్యే సెక్స్ బొమ్మలలో దాదాపు 70% చైనాలో తయారవుతున్నాయి. లండన్‌కు చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ టెక్నావియో ప్రకారం…2018 లో అడల్ట్ టాయ్స్,ఆటలు మరియు ఆరోగ్య పదార్ధాలతో కలిపి భారతదేశం యొక్క “లైంగిక సంరక్షణ” పరిశ్రమ విలువ 2,000 కోట్లు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం ఒకటి అని టెక్నావియోకు చెందిన ఒక విశ్లేషకుడు 2018లో చెప్పారు