పుల్వామా దాడి .. 49కి చేరిన‌ మృతుల సంఖ్య

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 06:59 AM IST
పుల్వామా దాడి .. 49కి చేరిన‌ మృతుల సంఖ్య

జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్ర‌వ‌రి-14,2019) పాక్ కి చెందిన ఉగ్ర‌సంస్థ జైషే మ‌హ‌మ‌ద్ జ‌రిపిన ఎల్ఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జ‌వాన్ల సంఖ్య 49కి చేరింది.బ్లాస్ట్ లో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ జ‌వాన్ల‌లో ఈ రోజు న‌లుగురు మృతిచెందారు. శ్రీన‌గ‌ర్‌లోని బ‌దామిభాగ్ హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతూ న‌లుగురు జ‌వాన్లు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 49కి చేరుకుంది.  
 ఇప్ప‌టికే 46 మంది జ‌వాన్ల మృత‌దేహాల‌ను వాళ్ల వాళ్ల స్వంత గ్రామాల‌కు త‌ర‌లించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. పుల్వామా ఉగ్ర‌దాడి ప్ర‌పంచ‌దేశాలు ఖండించాయి. పుల్వామా ఉగ్ర‌దాడికి పాల్ప‌డిన‌వారిని వ‌దిలేప‌ట్టే ప్ర‌శ‌క్తే లేద‌ని ప్ర‌ధాని హెచ్చ‌రించారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న‌ట్లు తెలిపారు.