Terror Attack: జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి కలకలం.. ఆర్మీ డ్రస్‌లో వచ్చి టూరిస్టులపై టెర్రరిస్టుల కాల్పులు.. 25మందికి పైగా మృతి

ఉగ్రవాదుల కాల్పులతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

Terror Attack: జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి కలకలం.. ఆర్మీ డ్రస్‌లో వచ్చి టూరిస్టులపై టెర్రరిస్టుల కాల్పులు.. 25మందికి పైగా మృతి

Updated On : April 23, 2025 / 2:47 PM IST

Terror Attack: జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో 25మందికి పైగా పర్యాటకులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఏడుగురు టెర్రరిస్టులు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. బైసరన్ లోయను చూసేందుకు వెళ్లిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ట్రెక్కింగ్ ట్రిప్ కోసం వెళ్లిన టూరిస్టులపై ముష్కరులు కాల్పులు జరిపారు.

జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి కలకలం రేపింది. పహల్ గామ్ లో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఉగ్రవాదుల కాల్పులతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

కొంత కాలంగా జమ్ముకశ్మీర్ లో ప్రశాంత వాతావరణమే కొనసాగుతోంది. సడెన్ గా ఉగ్రదాడి జరగడం తీవ్ర కలకలకం రేపుతోంది. టూరిస్టులపై దాడి జరగడంతో పహల్ గామ్ ప్రాంతం అంతా వణికిపోయింది. దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు కోసం ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నాయి. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఆ తర్వాతే పహల్ గామ్ లోకి అనుమతిస్తున్నారు.

Also Read: UPSC సివిల్స్ ఫలితాలు విడుదల.. టాప్ 10 ర్యాంకర్లు వీరే.. తొలి రెండు ర్యాంకులు అమ్మాయిలకే..

పహల్గామ్‌లోని బైసరన్ లోయ ఎగువ పచ్చిక బయళ్లలో తుపాకీ కాల్పులు వినిపించాయి. ఈ ప్రాంతానికి కాలినడకన లేదా గుర్రంపై మాత్రమే చేరుకోవచ్చు. అడవులు, స్ఫటిక స్పష్టమైన సరస్సులు, విశాలమైన పచ్చిక బయళ్లకు ప్రసిద్ధి చెందిన పహల్గామ్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here

ఉగ్రదాడిపై సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే తాను షాక్ కి గురయ్యాను అని తెలిపారు. దాడికి పాల్పడిన వారు మనుషులు కాదన్నారు. దాడిని ఖండించడానికి మాటలు సరిపోవన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

లోయలో పర్యాటకులు ఎక్కువగా ఉండే సమయంలో, అమర్‌నాథ్ యాత్రకు దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ ఉగ్రదాడి తీవ్ర భయాందోళనకు గురి చేసింది. 38 రోజుల యాత్ర జూలై 3 నుండి రెండు మార్గాల నుండి ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కి.మీ పహల్గామ్ మార్గం, గండేర్‌బాల్ జిల్లాలోని 14 కి.మీ బాల్తాల్ మార్గం. ఇది తక్కువ దూరం. కానీ నిటారుగా ఉంటుంది.