Congress Leader : కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం

రాజస్థాన్‌లోని బికనీర్‌లో కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కర్రలతో చితకబాదారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా రెచ్చిపోయారు.

Congress Leader : కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం

Congress (5)

Updated On : October 8, 2021 / 1:36 PM IST

Attempted murder on Congress leader : రాజస్థాన్‌లోని బికనీర్‌లో కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కర్రలతో చితకబాదారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా రెచ్చిపోయారు. ఒకరు, ఇద్దరు కాదు.. ఐదుగురు వ్యక్తులు ఒక్కసారిగా అతడిపై దాడికి దిగారు.

కారులో నుంచి అతడిని కిందకు లాగడమే కాదు… రోడ్డుపై పడేసి ఇష్టారీతిన చితకబాదారు. అతడి శరీరంలోని ఏ భాగాన్ని వదలకుండా కసిదీరా కొట్టారు. బాధితుడు ఈరోజు ఉదయం ఆలయానికి వచ్చిన సమయంలో ఈ అటాక్‌ జరిగింది.

Briton on Indians: తగ్గిన బ్రిటన్.. భారతీయులపై ఆంక్షల సడలింపు!

అతడి కారును అడ్డగించిన దుండగులు… ఒక్కసారిగా రణరంగం సృష్టించారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అతడిపై విరుచుకుపడ్డారు. ఈ రౌడీయిజాన్ని అక్కడి వారందరూ చూస్తున్నా ఏ ఒక్కరూ వారిని అడ్డుకోలేదు.

ఈ దృశ్యాలన్న అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కొందరు నిందితులను గుర్తించామంటున్నారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.