ఐవర్‌మెక్టిన్.. ఇది కరోనావైరస్ నిజమైన కిల్లర్ : ప్రొఫెసర్ బోరోడీ

కరోనా వైరస్ నుంచి కాపాడే మెడిసిన్ ఎప్పుడు వస్తుందా? అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో పరిశోధనలు చివరి దశకు వచ్చేశాయి. అయితే వాక్సిన్ విపణిలోకి రావాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆస్ట్రేలియాలోని ఓ మెడిసిన్ కరోనాపై గట్టిగా పోరాడుతుందని ఆస్ట్రేలియా సెంటర్ ఫర్ డైజెస్టివ్ డిసీజ్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ థామస్ బోరోడీ వెల్లడించారు.
పరాన్న జీవుల (పారాసైట్స్) నుంచి సంక్రమించే వ్యాధులు నయం చేయడానికి ఉపయోగించే యాంటీ పారాసైటిక్ డ్రగ్ ‘ఐవర్‌మెక్టిన్’ (Ivermectin) కరోనా వైరస్‌ను పూర్తిగా నాశనం చేస్తోందని ఆయన తెలిపారు. 48 గంటల్లో ఈ మెడిసిన్ కరోనాను పూర్తిగా చంపేస్తోందని ఆయన అంటున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ డ్రగ్‌తో క్లినికల్ ట్రయల్స్ జరిపితే కొవిడ్-19 చికిత్సకు ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఈ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే లభిస్తుంది. ఒంటరిగా దీనిని ఉపయోగించకూడదు. డాక్సీసైక్లిన్ మరియు జింక్ వంటి మరో రెండు ఉత్ప్రేరకాలను దీనికి జోడించాలి. ఐవర్‌మెక్టిన్ ఇప్పటికే ఎఫ్‌డిఎ ఆమోదం పొందగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అవసరమైన మెడిసిన్ మోడల్ జాబితాలో దీనిని ఉంచింది. ఈ మెడిసిన్ ఒక్క డోస్ 48 గంటల్లోనే వైరస్ అణువులన్నిటినీ తొలగించిందని, 24 గంటల్లోనే వైరస్ తగ్గుదల కనిపిస్తుందని బోరోడీ చెప్పుకొచ్చారు.
బంగ్లాదేశ్‌లో 14 ఆస్పత్రులలో ఈ మెడిసిన్ వాడగా.. 100 లో 100 మంది కరోనా నుంచి కోలుకున్నారు. చైనాలో దీనిని పునరుత్పత్తి చేయడానికి ప్రయత్నించారు. అక్కడ కూడా 60 మందిలో 60 మంది కోలుకున్నారు. కాబట్టి ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్, జింక్ చికిత్స మిగిలినవాటి కంటే మెరుగైనది. ఎందుకంటే ఇది చాలా తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది కరోనావైరస్ నిజమైన కిల్లర్ “అని బోరోడి చెప్పారు.
ఐవర్‌మెక్టిన్ టాబ్లెట్‌కు 2డాలర్లు కంటే తక్కువ ఖర్చు అవుతుందని బోరోడీ చెప్పారు. అందువల్ల మెడిసిన్ తయారీదారులు దీని వినియోగాన్ని ప్రోత్సహించలేదు. ఈ వ్యాధికి నివారణను కలిగి ఉండటం వలన ప్రజలు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా పోతుందని, ఇది వైద్యులకు తక్కువ డబ్బును ఇస్తుందని అందుకే దీనిని ప్రాచుర్యంలోకి తీసుకుని రాలేదని ఆయన ఆరోపించారు.