అయోధ్య విచారణ..కొత్త డెడ్ లైన్

  • Published By: madhu ,Published On : October 4, 2019 / 03:38 PM IST
అయోధ్య విచారణ..కొత్త డెడ్ లైన్

Updated On : October 4, 2019 / 3:38 PM IST

వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన విచారణలో తాజాగా సుప్రీంకోర్టు మరో డెడ్ లైన్ విధించింది. కొన్ని రోజులుగా ఈ వివాదంపై సుప్రీంలో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం 37వ రోజు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ పలు ఆదేశాలు జారీ చేశారు. ముస్లిం పక్షాన వాదనలు అక్టోబర్ 14న ముగుస్తాయని, తర్వాత రెండు రోజుల పాటు హిందూ పక్షాలకు సంబంధించిన వాదనలు వింటామని స్పష్టం చేసింది. అనంతరం అక్టోబర్ 17తో విచారణ ముగిస్తామని స్పష్టం చేశారు. 

భూ వివాదంలో మధ్యవర్తిత్వం విఫలమైంది. దీంతో సుప్రీం రోజు వారీ విచారణ చేపట్ట సాగింది. మధ్యవర్తిత్వం వహించడం ద్వారా కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరక్కపోవడంతో ఆగస్టు 06 నుంచి ప్రతిరోజు అయోధ్య భూ వివాదంపై కేసుల్లో వాదనలు జరుగుతున్నాయి. 

ఇటీవలే అక్టోబర్ 18తో వాదనలు ముగించాలని అనుకున్నా..దానికంటే ఒక రోజు ముందుగానే డెడ్ లైన్ విధించింది సుప్రీం కోర్టు. అదే రోజున కోర్టు ఆదేశాలను రిజ్వర్వ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నవంబర్ 17తో సీజేఐ పదవీకాలం ముగియనుంది. తాజా నిర్ణయంతో అయోధ్య కేసు వివాదంపై తీర్పు వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. 

Read More : సెలబ్రెటీలపై దేశద్రోహం కేసు : రాహుల్ స్పందన