Azam Khan: ఎమ్మెల్యే పదవికి కోల్పోనున్న అజాం ఖాన్.. 2013లోని సుప్రీం తీర్పు ఏం చెబుతోంది?

2019లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎం యోగితో పాటు ఐఏఎస్ అధికారి ఆంజనేయ కుమార్ సింగ్, జిల్లా యంత్రాంగ కార్యాలయంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింల ఉనికికి క్లిష్టమైన వాతావరణాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన కోర్టు అజాం ఖాన్‭ను దోషిగా తేల్చింది.

Azam Khan: ఎమ్మెల్యే పదవికి కోల్పోనున్న అజాం ఖాన్.. 2013లోని సుప్రీం తీర్పు ఏం చెబుతోంది?

Azam Khan might lose his MLA seat after getting a three years jail term

Updated On : October 28, 2022 / 7:30 PM IST

Azam Khan: విధ్వేష ప్రసంగం కేసులో దోషిగా తేలిన సమాజ్‭వాదీ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ తన అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోనున్నారా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దానికి 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఆ తీర్పు ప్రకారం.. చూసినట్లైతే రాంపూర్‭లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం విధించిన జైలు శిక్ష ప్రకారం అజాం ఖాన్ తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోతారు.

ఇంతకీ.. 2013లో సుప్రీంకోర్టు ఏం తీర్పు నిచ్చిందంటే.. క్రిమినల్ కేసులో దోషిగా తేలి రెండేళ్ల జైలు శిక్ష పడితే చట్ట సభల్లో ఉన్న సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. దీని ప్రకారం చూస్తే.. అజాం ఖాన్‭కు రాంపూర్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయనపై నమోదైన కేసు కూడా క్రిమినల్ కేసు పరిధిలోకే వస్తుంది.

2019లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎం యోగితో పాటు ఐఏఎస్ అధికారి ఆంజనేయ కుమార్ సింగ్, జిల్లా యంత్రాంగ కార్యాలయంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింల ఉనికికి క్లిష్టమైన వాతావరణాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన కోర్టు అజాం ఖాన్‭ను దోషిగా తేల్చింది.

చీటింగ్ కేసులో సుమారు 27 నెలలు జైలు శిక్ష అనుభవించిన అజాం ఖాన్.. మధ్యంతర బెయిల్ లభించడంతో ఈ యేడాది మే నెలలో విడుదలయ్యారు. ఉత్తరప్రదేశ్‭లో పేరున్న సీనియర్ రాజకీయ నేతల్లో అజాం ఖాన్ ఒకరు. ఇక సమాజ్‭వాదీ పార్టీలో అయితే ములాయం తర్వాత ములాయం లాంటి వారనే పేరు కూడా ఉంది. అయితే ఈయనను జైలులో వేయడం పట్ల సమాజ్‭వాదీ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. విపక్షాల్ని అణచివేసే క్రమంలో భారతీయ జనతా పార్టీ ఉద్దేశ పూర్వకంగానే అజాం ఖాన్‭ను జైలుకు పంపిందని అఖిలేష్ సహా అనేక ఇతర నేతలు అప్పట్లో విమర్శలు గుప్పించారు.

Memes on Parag: పరాగ్ అగర్వాల్‭ను ట్విట్టర్ నుంచి తొలగించిన మస్క్.. మీమ్స్‭తో నెటిజెన్ల హల్‭చల్