బాబ్రి కేసు: ఎల్ కే అద్వానీ, మరో 31 మంది నిర్దోషులే.

Babri Mosque Demolition Verdict: బాబ్రి మసీదు కూల్చివేత వెనుక ఎలాంటి కుట్రా లేదంటూ, 28 ఏళ్ల బాబ్రీ కేసును ఒక్క వ్యాఖ్యతో కోర్టు కొట్టేవేసింది. బీజేపీ సీనియర్లు lk advani, మురళీ మనోషర్ జోషి, ఉమాభారతితో సహా అందరినీ నిర్దోషులుగా కోర్టు తేల్చేసింది. రామజన్మభూమిలో ఉన్న బాబ్రీ మసీదు విధ్వంసంకేసులో తుది తీర్పును లక్నోలోని స్పెషల్ కోర్టు ప్రకటించింది.
2000వేల పేజీల తీర్పులో న్యాయమూర్తిచేసిన ఐదు ముఖ్యమైన వ్యాఖ్యలు
1. బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక ఎలాంటి ప్లానింగ్ లేదు.
2. నిందులకు వ్యతిరేకంగా సరిపడా సాక్ష్యాధారాలు లేవు.
3. సిబిఐ సమర్పించిన ఆడియో, వీడియోలను నమ్మలేం.
4. మసీదుమీదకెక్కనివాళ్లు సంఘ విద్రోహులు
5. విధ్వంసం సమయంలో ప్రసంగాల ఆడియోలో క్లారిటీ లేదు.