AAP Office : ఢిల్లీలో సంబరాలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా బేబీ కేజ్రీవాల్
ఓ బుడ్డోడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. కేజ్రీవాల్ - భగవంత్ మాన్ వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నాడు. అతని కుటుంబం మొత్తం కేజ్రీవాల్ టీ షర్టులు ధరించి ఆప్ ఖాతాలో...

Aap
Baby Kejriwal : పంజాబ్‌లో ఆప్ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను చీపురుతో ఊడ్చేసింది. 117 సీట్లున్న పంజాబ్ లో ఏకంగా ఆప్ 90 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉండిపోయింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ప్రజలు పట్టించుకోలేదు. ఆ పార్టీ 17 స్థానాల్లో అధిక్యంలో ఉంది. బీజేపీ కేవలం రెండు స్థానాల్లో కొనసాగుతోంది. పార్టీ విజయం దిశగా ముందుకెళుతుండడంతో నేతలు, అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద సందడి సందడి వాతావరణం నెలకొంది. బాణాసంచా కాలుస్తూ.. శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటున్నారు. డప్పు వాయిద్యాలు నడుమ డ్యాన్స్ లు వేస్తున్నారు.
Read More : Punjab : కాంగ్రెస్ కొంపముంచిన సిద్ధూ!.. రాజీనామా చేస్తానని సంకేతాలు
అయితే…ఓ బుడ్డోడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. కేజ్రీవాల్ - భగవంత్ మాన్ వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నాడు. అతని కుటుంబం మొత్తం కేజ్రీవాల్ టీ షర్టులు ధరించి ఆప్ ఖాతాలో రెండు రాష్ట్రాలు వచ్చాయంటూ సంబరాలు చేసుకుంటోంది. ఢిల్లీలోలానే.. పంజాబ్‌లోనూ సంక్షేమ పథకాలు అమలయ్యి.. అక్కడి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించిన తర్వాత.. ఈ బుడ్డోడు అప్పటి విజయోత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అచ్చు సీఎం కేజ్రీవాల్ లా తయారయ్యాడు. ఎరుపు రంగు స్వెట్టర్, మెడలో నలుపు రంగు కండువా, తలపై ఆప్ టోపీ మీసాలతో అందర్నీ ఆకర్షించాడు. ఇప్పుడా ఆ బుడ్డోడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.
Read More : AAP in Punjab: పంజాబ్ ను కైవసం చేసుకున్న “ఆమ్ ఆద్మీ”: సక్సెస్ సీక్రెట్
తమ గత చరిత్రను చూసి గర్వంగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ అయితే.. ఆ పార్టీని చాలా లైట్ తీసుకుంది. నూట పాతికేళ్ల మా చరిత్ర ఎక్కడా.. నిన్నగాక మొన్న పుట్టుకొచ్చిన మీ చరిత్ర ఎక్కడా అంటూ ఆమ్ ఆద్మీ పార్టీని కేర్ చేయలేదు. కానీ కామన్ మ్యాన్‌ను నమ్ముకున్న పార్టీ పవర్ ఎలా ఉంటుందో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కు రుచి చూపించింది. 15 యేళ్ల పాటు దేశ రాజధాని ఢిల్లీని ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్న కాంగ్రెస్‌ను చీపురు కట్టతో ఊడ్చేసి ఆప్ అధికారంలోకి వచ్చింది..ఇది 2013 నాటి సంగతి.. అప్పుడు ఢిల్లీలో ఏం జరిగిందో.. ఇప్పుడు పంజాబ్‌లో అదే చరిత్ర రిపీట్ అయ్యింది. అయితే కాంగ్రెస్ లేదా బాదల్ 70 ఏళ్లుగా.. పంజాబ్ అంటేనే ఈ రెండు పార్టీలకు అడ్డాగా మారింది. ఇప్పుడా ఇమేజ్ను కేజ్రీవాల్ మార్చేశారు. నాడు ఢిల్లీలో కాంగ్రెస్‌ను ఇంటి దారి పట్టించిన కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి మంగళం పాడేశారు.