Bharat Bandh : నేడు భారత్ బంద్..కులాల వారీగా జనగణనకు డిమాండ్

వెనుకబడిన తరగతుల కోసం కుల ఆధారిత జనాభా గణనను కేంద్రం చేపట్టకపోవడంతో సమ్మెకు పిలుపు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని BAMCEF డిమాండ్ చేస్తోంది.

Bharat Bandh : నేడు భారత్ బంద్..కులాల వారీగా జనగణనకు డిమాండ్

Bharat Bandh

Updated On : May 25, 2022 / 10:08 AM IST

Bharat Bandh : కులాల వారీగా జనగణన కోరుతూ నేడు భారత్ బంద్ కు పిలుపిచ్చారు. ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (BAMCEF) భారత్ బంద్ కు పిలుపిచ్చింది. కుల ప్రాతిపదికన జన గణన చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. వెనుకబడిన తరగతుల కోసం కుల ఆధారిత జనాభా గణనను కేంద్రం చేపట్టకపోవడంతో సమ్మెకు పిలుపు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని BAMCEF డిమాండ్ చేస్తోంది.

ఎన్నికల సమయంలో EVMలను ఉపయోగించడం, జాతీయ పౌరుల నమోదు (NRC), పౌరసత్వ సవరణ చట్టం సమస్యలపై BAMCEF నిరసన వ్యక్తం చేస్తోంది. జాతీయ జనాభా రిజిస్టర్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో పంచాయతీ ఎన్నికలలో OBC రిజర్వేషన్‌లో ప్రత్యేక ఓటర్లను అమలు చేయడం , పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రారంభించడం, కార్మిక హక్కుల పరిరక్షణ, గిరిజన ప్రజలను నిర్వాసితులుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కు పిలుపిచ్చింది.

Bharat Bandh : ఈ నెల 25న భారత్ బంద్.. డిమాండ్స్ ఇవే..

పర్యావరణ పరిరక్షణ పేరుతో గిరిజన నిర్వాసితులకు వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలకు నిరసనగా, టీకాపై బలవంతపు ఒత్తిడికి వ్యతిరేకంగా, లాక్‌డౌన్‌లో రహస్యంగా కార్మికులపై చేసిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టనుంది. రైతుల పంటలకు మద్దతు ధర కల్పించాలని BAMCEF డిమాండ్ చేస్తోంది.దేశంలో కులాల వారీగా జనగణ చేయాలని జేడీయు సహా అనేక పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను ఫెడరేషన్ నేతలు కోరారు. బంద్ కు మద్దతుగా వ్యాపారాలు, ప్రజా రవాణాను మూసివేయాలని కోరుతున్నారు.