అప్పటివరకు 3జీ, 4జీ సేవలు బంద్

  • Published By: vamsi ,Published On : February 16, 2020 / 01:51 AM IST
అప్పటివరకు 3జీ, 4జీ సేవలు బంద్

Updated On : February 16, 2020 / 1:51 AM IST

నిఘా వర్గాలు నుంచి వచ్చిన రిపోర్ట్‌ల ప్రకారం 3జీ, 4జీ సేవలను ఫిబ్రవరి 24వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది జమ్మూ కశ్మీర్. జమ్మూ కాశ్మీర్‌లో హైస్పీడ్ 3 జి, 4 జి ఇంటర్నెట్ సేవలను నిషేధించినట్లు వెల్లడించింది. 2జీ ఇంటర్నెట్ సేవలు, 1400+ వైట్‌లిస్ట్ వెబ్‌సైట్‌లతో పనిచేస్తూనే ఉంటాయని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తెలిపింది. 

జమ్మూ కశ్మీర్‌లో ఈ డేటాను తాత్కాలికంగా నిలిపివేయడంపై స్పష్టం చేస్తూ, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. సాధారణ ప్రజలను ప్రభావితం చేసే పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని, తద్వారా ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రయత్నాలు జరిగినట్లు ఇంటెలిజెన్స్ చెప్పిందని,  అందుకే మొబైల్ డేటాపై తాత్కాలిక నిషేదం విధించినట్లు చెప్పింది. 

అంతేకాదు 2జీ ఇంటర్నెట్ సదుపాయం ఉన్న వ్యక్తులు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమైన రెచ్చగొట్టే విషయాలను ప్రచారం చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన జనవరి 24న ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరి 24వ తేదీ వరకు 3జీ, 4జీ వంటి అందుబాటులో ఉండవు.