BJP: వారి ఆటకట్టించడానికే హిందూ ఏక్తా యాత్ర: బండి సంజయ్

చాలా మంది కుహనా లౌకికవాదులు ఉన్నారని బండి సంజయ్ చెప్పారు.

BJP: వారి ఆటకట్టించడానికే హిందూ ఏక్తా యాత్ర: బండి సంజయ్

Bandi Sanjay Kumar(Photo : Twitter)

Updated On : May 14, 2023 / 9:06 PM IST

Bandi Sanjay: రజాకార్ల రాజ్యానికి పాతరేస్తామని, రామరాజ్యాన్ని స్థాపిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దీని కోసమే తాము హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని కరీంనగర్‌ (Karimnagar) లో ఇవాళ బీజేపీ హిందూ ఏక్తా యాత్ర (Hindu Ekta Yatra Rally) నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… భారత్ లో హిందుత్వం లేకపోతే దేశం పాకిస్థాన్ అయ్యేదని అన్నారు. హిందుత్వాన్ని కాపాడే పార్టీ అధికారం లేకపోవడంతోనే కర్ణాటకలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారని చెప్పారు. ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే పాక్ అనుకూల నినాదాలు చేస్తున్నారని తెలిపారు.

ఒకే ఒక్క రాష్ట్రంలో తమ పార్టీ గెలవకపోతే ఏంటని బండి సంజయ్ నిలదీశారు. తమ పార్టీ 15కి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉందని తెలిపారు. మరో అయిదు నెలల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాయని చెప్పారు. తాము తెలంగాణలో హిందుత్వ వాతావరణాన్ని తీసుకొస్తామని తెలిపారు.

చాలా మంది కుహనా లౌకికవాదులు ఉన్నారని, వారి ఆటకట్టించడానికే హిందూ ఏక్తా యాత్ర చేపట్టామని బండి సంజయ్ చెప్పారు. భజరంగ్ దళ్ ను నిషేధించినా, ముస్లిం రిజర్వేషన్లను అమలు చేసినా ఊరుకోబోమని అన్నారు.

BJP: మా రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తాం.. తెలంగాణలో మాత్రం: అసోం సీఎం హిమంత