Road Accident: యువతి ప్రాణాలు తీసిన బస్ డ్రైవర్ నిర్లక్ష్యం
సీమ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త, బిడ్డకు గాయాలయ్యాయి. బీఎంటీసీ బస్సు డ్రైవర్‌ను..

Bengaluru: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ యువతి ప్రాణాలు తీసింది. బెంగళూరులో 21 ఏళ్ల వివాహిత మృత్యువాత పడింది. బెంగళూరులో ఇటువంటి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రెండు నెలల్లో ఏడు బీఎంటీసీ బస్సు ప్రమాదాలు జరిగాయి.
ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని మడివాళ ఫ్లైఓవర్‌లోని సిల్క్ బోర్డ్ అప్‌రాంప్‌పై గురుమూర్తి (26) అనే వ్యక్తి తన భార్య సీమ, తమ కుమారుడి (10 నెలలు)తో కలిసి బైక్ పై వెళ్తున్నారు. బీఎంటీసీ బస్సు వారి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. బైకుపై నుంచి బస్సు వెళ్లింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
సీమ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త, బిడ్డకు గాయాలయ్యాయి. బీఎంటీసీ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురుమూర్తి కుటుంబం హోసూరు రోడ్డులోని సింగసంద్రలోని తమ ఇంటి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై బీఎంటీసీ ఇంకా స్పందించలేదు.
తరుచూ ప్రమాదాలు
బీఎంటీసీ బస్సులు నగరంలో తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. పెరిగిన ట్రాఫిక్ రద్దీ, రోజువారీ ట్రిప్ లక్ష్యాలను సాధించడానికి డ్రైవర్లు ఒత్తిడికి గురవుతుండడం, తీవ్రంగా అలసిపోతుండడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Parliament: పార్లమెంట్‌లో గందరగోళం.. 15 మంది ఎంపీల సస్పెన్షన్