బ్యాంక్ లోన్ ఎగ్గొడితే ఎన్నికల్లో పోటీకి అనుతించొద్దు: ఈసీకి వినతి

బ్యాంకుల వద్ద అప్పులు (లోన్స్) తీసుకుని ఎగ్గొట్టిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వవద్దు అంటు బ్యాంక్ వర్కర్స్ అసోసియేషన్ ఎన్నికల సంఘాన్ని కోరింది.

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 10:33 AM IST
బ్యాంక్ లోన్ ఎగ్గొడితే ఎన్నికల్లో పోటీకి అనుతించొద్దు: ఈసీకి వినతి

బ్యాంకుల వద్ద అప్పులు (లోన్స్) తీసుకుని ఎగ్గొట్టిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వవద్దు అంటు బ్యాంక్ వర్కర్స్ అసోసియేషన్ ఎన్నికల సంఘాన్ని కోరింది.

బ్యాంకుల వద్ద అప్పులు (లోన్స్) తీసుకుని ఎగ్గొట్టిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వవద్దు అంటు బ్యాంక్ వర్కర్స్ అసోసియేషన్ ఎన్నికల సంఘాన్ని కోరింది. బ్యాంకులలో లోన్లు తీసుకుని ఎగవేసే వ్యక్తులపై వేటు వేయాలని..లోన్ తీసుకున్న అభ్యర్థులు (ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు)  చెల్లింపుల్లో డిఫాల్ట్ కాలేదని..రుణాలు ఎగ్గొట్టలేదనే అంశాలను వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.  అభ్యర్థులు బ్యాంకులు అందించే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) పత్రాన్ని సమర్పిస్తేనే ఎన్నికల్లో పోటీకి అనుమతించాలని..ఇలా చేస్తేనే రాజకీయ నాయకులు రుణాలు ఎగొట్టకుండా ఉంటారని తెలిపింది. ఈ విషయాలను తెలియజేస్తూ వర్కర్స్ యూనియన్ ఈసీకి ఒక ఈ-మెయిల్ పంపింది. 
Read Also : దేవడా : ఓటర్ల లిస్టులో బాహుబలి, ఇడ్లీ, సెక్స్, నిట్

భారత్‌లోని బ్యాంకుల్లో మొండిబకాయిలు (ఎన్‌పీఏ) భారీగా పేరుకుపోయయని బ్యాంక్ అసోసియేషన్ తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు.. వారికి కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి రుణ ఎగవేతలు లేవని ప్రకటిస్తేనే పోటీకి అనుమతించాలని ఢిల్లీ ప్రదేశ్ బ్యాంక్ వర్కర్స్ అర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అశ్విని రానా తెలిపారు. 

ఎన్నికల కమిషన్ గతంలో ఇటువంటి ప్రతిపాదన చేయగా దాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఒక సాధారణ వ్యక్తి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే..ఆ రుణ మంజూరుకు చాలా ప్రక్రియ ఉంటుందని..రాజకీయ నాయకుల విషయంలో కూడా రుణ మంజూరుకు సంబంధించి ఇదే ప్రక్రియను కొనసాగాలని ఢిల్లీ ప్రదేశ్ బ్యాంక్ వర్కర్స్ అర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అశ్విని రానా కోరారు.
Read Also : ఆ నలుగురు ఎవరు : TRS సిట్టింగ్ ఎంపీలకు ఫిట్టింగ్ ?