Bank Holidays
Bank Holidays: బ్యాంకింగ్ సేవలకు మరోసారి ఆటంకం కలగనున్నాయి. సెలవులతో కస్టమర్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈరోజు ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, రేపు ఏప్రిల్ 15 న గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక శనివారం ఏప్రిల్ 16న ఒక్కరోజు బ్యాంకులు తెరుచుకోనుండగా.. మళ్ళీ ఆదివారం సెలవు ఉంది. ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతితో పాటు ఇదే రోజు మహావీర్ జయంతి, వైశాఖి, తమిళనాడు న్యూ ఇయర్, బిజు ఫెస్టివల్ కూడా వస్తున్నాయి.
Bank Holidays April 2022 : ఏప్రిల్ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. హాలిడేస్ లిస్ట్ ఇదే..
దీంతో మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 14న బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది. అలాగే ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడేతో పాటు బెంగాలీ న్యూ ఇయర్, హిమాచల్ డే వస్తున్నాయి. రాజస్తాన్, జమ్మూకశ్మీర్, శ్రీనగర్ మినహా ఏప్రిల్ 15న అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు మూతపడనున్నాయి. అనంతరం ఏప్రిల్ 16న కూడా అస్సాంలో బ్యాంకులు మూసి ఉంటాయి. ఈరోజు అస్సాంలో బొహగ్ బిహు పండగను జరుపుకుంటారు. మిగతా రాష్ట్రాలలో బ్యాంకులు పనిచేస్తాయి.
Union Bank : బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. 18 గంటల పాటు లాకర్ గదిలో 75 ఏళ్ల వృద్ధుడు
కాబట్టి వినియోగదారులు ఈ తేదీలను గుర్తుపెట్టుకొని అస్సాం మినహా అత్యవసర బ్యాంకు పనులు ఉంటే శనివారం చేసుకోవాల్సి ఉండగా.. మిగతా సాధారణ పనులను సోమవారం అనంతరం వరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే నాలుగు రోజులలో శనివారం ఒక్కరోజే వర్కింగ్ డే అంటే సాధారణంగానే కస్టమర్ల రద్దీ ఎక్కువ ఉంటుంది.