కొలీగ్స్‭తో అసంతృప్తి.. సందేశం పంపి ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి

సెక్టార్ 9ఏ పోలీస్ స్టేషన్‭లో కేసు నమోదైంది. భార్య పూజా మోహర్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమిత్, పూజాలకు పెళ్లై పదేళ్లైంది. కాగా, ఆఫీసు పనిలో ఒక నిర్ణయమై ఒక మహిళా సహోద్యోగితో అమిత్‭కు గొడవైందని, ఈ కారణం చేతనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు వస్తున్నాయి. అయితే పోలీసులు దీన్ని ధ్రువీకరించలేదు.

కొలీగ్స్‭తో అసంతృప్తి.. సందేశం పంపి ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి

Before Death By Suicide Man Texted Colleagues He Was Upset colleagues

Updated On : September 1, 2022 / 6:15 PM IST

ఆఫీసులో సహోద్యోగులతో అసంతృప్తి చెందిన ఒక వ్యక్తి(40).. ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమిత్ కుమార్ అనే వ్యక్తి గురుగ్రామ్‭లోని రవి నగర్ కాలనీలో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. అతడు ఒక మల్లీనేషనల్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‭గా పని చేస్తున్నాడు. కాగా, తాను ఒక విపత్కర నిర్ణయం తీసుకున్నానని తన సహోద్యోగుల్లో కొందరికి మెసేజ్ చేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

బుధవారం ఉదయం 7:20 నిమిషాలకు అమిత్ భార్యకు అతడు పని చేసే ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. తన పేరు కుమార్ అని అమిత్ సహోద్యోగినని చెప్పాడు. తనకు పంపిన మెసేజ్ గురించి ఆమెకు చెప్పి ఒకసారి అమిత్‭ బాగానే ఉన్నాడా అని ప్రశ్నించాడు. ఆమెకు అనుమానం కలిగి హుటాహుటిన మెట్లెక్కి చూడగా.. అప్పటికే అమిత్ ఉరి వేసుకున్నాడు. వెంటనే అతడిని మెదాంత ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఈ విషయమై సెక్టార్ 9ఏ పోలీస్ స్టేషన్‭లో కేసు నమోదైంది. భార్య పూజా మోహర్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమిత్, పూజాలకు పెళ్లై పదేళ్లైంది. కాగా, ఆఫీసు పనిలో ఒక నిర్ణయమై ఒక మహిళా సహోద్యోగితో అమిత్‭కు గొడవైందని, ఈ కారణం చేతనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు వస్తున్నాయి. అయితే పోలీసులు దీన్ని ధ్రువీకరించలేదు.

Child Dies In Mother Arms: ఆసుపత్రిలో డాక్టర్ కోసం ఎదురు చూస్తూ తల్లి ఒడిలోనే కన్నుమూసిన 5 ఏళ్ల చిన్నారి