Beggar Stabs: ప్లాట్‌ఫాంపై మర్డర్ చేసిన బిచ్చగాడు.. రాత్రంతా శవాన్ని పక్కనే ఉంచుకుని

దేశ రాజధాని ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దివ్యాంగుడైన 65ఏళ్ల బిచ్చగాడు మరో వ్యక్తితో కలిసి ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. న్యూ ఇయర్ రోజు జరిగిన ఈ ఘటన బయటకు....

Beggar Stabs: ప్లాట్‌ఫాంపై మర్డర్ చేసిన బిచ్చగాడు.. రాత్రంతా శవాన్ని పక్కనే ఉంచుకుని

Dead Body

Updated On : January 3, 2022 / 7:10 PM IST

Beggar Stabs: దేశ రాజధాని ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దివ్యాంగుడైన 65ఏళ్ల బిచ్చగాడు మరో వ్యక్తితో కలిసి ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. న్యూ ఇయర్ రోజు జరిగిన ఈ ఘటన బయటకు తెలియకూడదని రాత్రంతా శవం పక్కనే పడుకున్నాడు.

శనివారం తెల్లవారుజాము 3గంటల 42నిమిషాలకు ప్లాట్ ఫాంపై ఒక మృతదేహాన్ని గమనించారు పోలీసులు. హోటల్ సూర్య గ్రాండ్ ముందున్న మృతదేహం ఛాతిపై కత్తి పోట్లు ఉన్నట్లు తెలిసింది. హత్య నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతుడిపేరు సుభాష్ నగర్ కు చెందిన చందన్ గా తెలిసింది. వరుణ్, విక్రమ్ లతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు వెళ్లగా.. అన్సల్ ప్లాజా రాజౌరి గార్డెన్ నుంచి బయటకు వచ్చారు. సిగరెట్స్ కోసమని వెళ్లి.. బెగ్గర్ వైపుగా వచ్చారు. ఆ సమయంలో సంతోష్ పాజియార్ (65) అనే బిచ్చగాడితో వాదన జరిగింది.

ఇది కూడా చదవండి : ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ

ఇదంతా చూసి బిచ్చగాడికి సన్నిహితుడైన వినోద్ (20) అక్కడికి వచ్చాడు. దివ్యాంగుడిని బూతులు తిడుతున్నట్లు గమనించాడు. కాసేపటి వరకూ ఘర్షణ జరగ్గా.. బిచ్చగాడు పదునైన ఆయుధంతో రెండు సార్లు కత్తిపోట్లు పొడిచాడు. అంతే ఆ వ్యక్తి ఘటనాస్థలంలోనే మృతిచెందడంతో మిగిలిన వారంతా పరారయ్యారు. సంతోష్ మాత్రం శవం పక్కనే పడుకుని దుప్పటి కప్పి పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.