Auto Journey : ఆటోల్లో ప్రయాణిస్తున్నారా.. బీకేర్ ఫుల్.. ఎందుకంటే

కన్నుమూసి తెరిచేలోగా బురిడీ కొట్టించాడు. రూ.మూడు వందలకు బదులు వెయ్యి రూపాయలు కాజేశాడు. బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ చేసిన చీటింగ్ వైరల్ అవుతోంది.

Auto Journey :  ఆటోల్లో ప్రయాణిస్తున్నారా.. బీకేర్ ఫుల్.. ఎందుకంటే

Bengaluru auto driver

Bengaluru Auto Driver : బెంగళూరులో ఆటోలో ప్రయాణం చేయాల్సి వస్తే ఎంత అప్రమత్తంగా ఉండాలో ఓ ఆటో డ్రైవర్ చేసిన ఘనకార్యం చూస్తే తెలుస్తుంది. కొంతమంది ఆటో డ్రైవర్లు కాస్త దూరానికే వందల వందల రూపాయాలు చార్జ్ చేస్తుంటారు. ఇక రూట్ తెలియనివారు..సిటీకి కొత్తగా వచ్చినవారు ఆటో ఎక్కితే ఇక అంతే సంగతులు వారి జేబులు ఖాళీ అయిపోవాల్సిందే. అదే జరిగింది బెంగళూరులో. ఓ ఆటో డ్రైవర్ చేసిన ఘనకార్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్ కు చెందని ఓ వ్యక్తి బెంగళూరు వచ్చాడు. ఓ ఆటో ఎక్కాడు. కానీ ఆ ఆటో డ్రైవర్ కనురెప్పపాటులో ప్రయాణికులను మభ్యపెట్టి డబ్బులు గుంజేసిన ఘటనను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ అవుతోంది.

Subramanian Swamy: ఉదయనిధి స్టాలిన్‌పై సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహం..

బంగ్లాదేశ్‌కు చెందిన ఎండీ ఫిజ్ అనే వ్యక్తి ఫిజ్ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల అతను భారత్ లోని కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు వచ్చాడు. బెంగళూరులో ఓ ఆటో ఎక్కాడు. అతను దిగాల్సిన ప్లేస్ రావటంతో దిగాడు. డ్రైవర్ కు రూ. 500 ఇచ్చాడు. కానీ ఆటో డ్రైవర్ మీ చార్జీ రూ.300లు అయ్యింది. మీరు రూ.100 ఇచ్చారు..మరో రూ. 200 ఇవ్వాలని చెప్పాడు. దానికి ఫిజ్ తానే పొరపాటు పడ్డానేమో అనుకుని ఆటో డ్రైవర్ నుంచి రూ.100 తీసుకుని మరో రూ. 500 నోటు ఇచ్చాడు. చిల్లర ఇవ్వబోతుండగా ఉంచుకోమని చెప్పాడు. కానీ ఆటో డ్రైవర్ చేసిన మోసం ఫిజ్ అప్పుడు గుర్తించలేదు. కానీ అప్పటికే తను తీస్తున్న వీడియోలో ఆటో డ్రైవర్ చేసిన మోసం అంతా రికార్డు అయ్యింది. ఆ తర్వాత తన రైడ్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే క్రమంలో జరిగిన మోసాన్ని ఫిజ్ గుర్తించాడు. వార్నీ తనను భలే బురిడీ కొట్టించాడే అనుకుని ఆశ్చర్యపోయాడు.

Bengaluru : బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక రూ.40 వేలు ఆదా అయ్యాయట.. ఓ వ్యక్తి పోస్ట్ వైరల్

దీంతో ఆ వీడియోను పోస్టు చేస్తు బెంగళూరులో ఈ డ్రైవర్ ఆటోను ఎక్కవద్దు అంటూ చెప్పుకొచ్చాడు వీడియోలో. ఆ వీడియోలో ఫిజ్ రూ. 500 ఇస్తే.. క్షణాల్లోనే దానిని తన షర్ట్ చేతి మడతల్లో దాచేసి అప్పటికే చేతిలో రెడీగా పెట్టుకున్న రూ.100 నోటును చూపించి.. మరో రూ. 200 ఇవ్వాలని అడిగినట్టుగా కనిపిస్తోంది. ఆ తర్వాత తన రైడ్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే క్రమంలో జరిగిన మోసాన్ని ఫిజ్ గుర్తించాడు. వీడియోను పోస్టు చేస్తూ బెంగళూరులో ఈ డ్రైవర్ ఆటోను ఎక్కవద్దని సూచించాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా బెంగళూరు ఆటోల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫిజ్ తన రైడ్ మొత్తాన్ని వీడియో తీస్తున్న విషయం తెలిసి కూడా డ్రైవర్ మోసం చేయడం.