నిబంధనలు పాటించండి లేకపోతే లాక్ డౌన్ తప్పదు మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక

Bengaluru Lockdown : భారతదేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఫుల్ స్పీడ్ గా కొనసాగుతోంది. కానీ..కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన నెలకొంది. కరోనా నిబంధనలు పాటించకుండా..కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో అధికారులు కఠిన చర్యలు తీసుకొనేందుకు సిద్ధమౌతున్నారు. ప్రజలు నిబంధనలు తు.చ తప్పకుండా పాటించకపోతే మరోసారి లాక్ డౌన్ విధిస్తామని హెచ్చరిస్తున్నారు. తాజాగా..బెంగళూరు మున్సిపల్ కమిషనర్ ఇదే విధంగా హెచ్చరించారు.
ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించకపోతే..కోవిడ్ – 19 కేసుల పెరుగుదలను నియంత్రించడంలో విఫలమైతే..మరోసారి లాక్ డౌన్ అమలు చేయడం తప్ప..మరో మార్గం లేదని కమిషనర్ ఎన్.మంజునాథ వెల్లడించారు. గత రెండు రోజులుగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో ఆయన పై విధంగా హెచ్చరించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా..నియంత్రణపై చర్చించేందుకు ఆయన ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో civic body’s doctors, officials, Joint Commissioners, Special Commissioners లు హాజరయ్యారు.
సామాజిక దూర నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, మాస్క్ లు ధరించడం తప్పనిసరి అని సూచించారు. ఇవి పాటించకపోతే..లాక్ డౌన్ శరణ్యమని, పొరుగు రాష్ట్రాలైన కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో కొవిడ్ కేసులు పెరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రెండోసారి లాక్ డౌన్ ఎంచుకుంది. ఇలాంటి దశకు రాష్ట్రం చేరుకోవడ్దని, కొత్త సవాల్ ను ఎదుర్కొవడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. యూకేలో కొత్త రకం వేరియంట్లపై మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నిరంతరం నిఘా ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.