Rapido: రాపిడో బైక్ బుక్ చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌.. జీవితాంతం గుర్తుండిపోయే 3 సర్‌ప్రైజ్‌లు

నిశిత్ పటేల్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెంగళూరులో కుబెర్నెటెస్ గ్రూపునకు సంబంధించిన మీటింగ్‌కు వెళ్లాల్సి ఉంది.

Rapido: రాపిడో బైక్ బుక్ చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌.. జీవితాంతం గుర్తుండిపోయే 3 సర్‌ప్రైజ్‌లు

Rapido

Updated On : August 11, 2023 / 9:01 PM IST

Rapido – Bengaluru: బెంగళూరులో రాపిడో బైక్ బుక్ చేసుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి ఎదురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను అతడు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

నిశిత్ పటేల్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వృత్తి రీత్యా బెంగళూరులో ఓ కుబెర్నెటెస్ గ్రూపునకు సంబంధించిన మీటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. అక్కడికి వెళ్లేందుకు రాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ (Royal Enfield Hunter) బైక్‌పై రాపిడో బాయ్ వచ్చాడు. అంత ఖరీదైన బైక్ తీసుకురావడంతో నిశిత్ పటేల్ ఆశ్చర్యపోయాడు.

ఇంతలో అతడికి మరో ఆశ్చర్యకర విషయం తెలిసింది. ఆ రాపిడో బైక్ పై తనను తీసుకెళ్తున్న వ్యక్తి కూడా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరే అని నిశిత్ తెలుసుకున్నాడు. ఆ సర్‌ప్రైజ్ అక్కడితో ఆగలేదు. తాను ఏ పనిమీద వెళ్తున్నానో అదే పని మీద, అదే ప్రాంతానికి ఆ రాపిడో బాయ్ వెళ్తున్నాడని నిశిత్ కి తెలిసింది.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా కొనసాగుతూనే రాపిడో బైక్ నడపుకుంటున్న అతడిని చూసి నిశిత్ ఆశ్చర్యపోయాడు. ఈ అనుభవాన్ని నిశిత్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొన్ని గంటలకే అతడి ట్వీట్ వైరల్ అయింది. దేశంలో చాలా మంది ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు రాపిడో బాయ్ గానూ కొనసాగుతున్నారని నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు.

Phone Snatch : రోడ్డు మీద చేతిలో ఫోన్ పట్టుకుని నిల్చున్నారా? అయితే బీకేర్‌ఫుల్.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి