కరోనా పేషెంట్‌ను రైల్వే గెస్ట్ హౌజ్‌లో దాచిన తల్లి అరెస్టు

రైల్వే మహిళా ఎంప్లాయ్ తన కొడుక్కి కరోనా ఉందని తెలిసినా దాచి ఉంచింది. దాంతో ఆ మహిళను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు. అంతేకాక, స్పెయిన్ నుంచి వచ్చిన తన కొడుకు వివరాలను రహస్యంగా ఉంచింది. అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆమె తన కొడుకు కోసం రైల్వే కాలనీలోని గెస్ట్ హౌజ్ లో రూమ్ బుక్ చేసింది. (కరోనా సాకుతో ధరలు పెంచినా..తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు – సీఎం జగన్)
తన కొడుకు కోసం ఇతరుల జీవితాలను పణంగా పెట్టాలని అనుకుందని స్థానికులు అంటున్నారు. పైగా తన కుటుంబానికి ఏం జరగకూడదని ఇంటికి దూరంగా గెస్ట్ హౌజ్ లో ఉంచిందని సౌత్ వెస్టరన్ రైల్వే అధికారులు అంటున్నారు. కొడుకును హాస్పిటల్‌లో చేర్పించారు. మార్చి 13న బెంగళూరులోని కెంపెగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగినప్పుడే ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.
ఐదు రోజుల తర్వాత జరిపిన టెస్టుల్లో అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల హెల్త్ రిపోర్టు చెక్ చేస్తున్న క్రమంలో ఆ ఉద్యోగిని కొడుకు గురించి అడిగితే వివరాలు దాచింది. నిజాలు తెలియడంతో కొడుకును హాస్పిటల్ కు పంపించి తల్లిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశామని రైల్వే అధికారులు తెలిపారు.
కర్ణాటకలో ఇప్పటివరకూ 16కరోనా కేసులు నమోదుకాగా, అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100మంది ఐసోలేషన్ వార్డుల్లో చేర్పించారు. భారత్‌లో కరోనా కేసులు 200కు చేరాయి.