ట్రెండ్లీ ఫుడ్ : ‘ఐస్ క్రీమ్ దోశ’ టేస్ట్‌కు ఫిదా అయిపోతున్న జనాలు

  • Published By: veegamteam ,Published On : February 22, 2020 / 05:28 AM IST
ట్రెండ్లీ ఫుడ్ : ‘ఐస్ క్రీమ్ దోశ’ టేస్ట్‌కు ఫిదా అయిపోతున్న జనాలు

Updated On : February 22, 2020 / 5:28 AM IST

ఫుడ్ ప్రియులు ఏ కొత్త టేస్ట్ వచ్చినా అక్కడ వాలిపోతారు. ట్రెండ్లీ ఫుడ్ ను చక్కగా ఆస్వాదిస్తారు. ఎంకరేజ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు. అటువంటిదే ‘ఐస్ క్రీమ్ దోశ’. ఈ ‘ఐస్ క్రీమ్ దోశ’ ఫిదా అయిపోయారు బెంగళూరు వాసులు. నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ సెట్ చేస్తానని గబ్బర్ సింగ్‌లో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అక్షరాలా నిజంగా చేస్తూ బెంగళూరులోని ఓ టిఫిన్‌ సెంటర్‌ యజమాని ‘ఐస్ క్రీమ్ దోశ’తో ప్రజల్ని ఆకట్టుకున్నాడు. ఆ టిఫిన్ సెంటర్ దగ్గర ‘ఐస్ క్రీమ్ దోశ’ కోసం పడిగాపులు పడుతున్నారు బెంగళూరు వాసులు. 

దోశలను దోశ, ఇడ్లీ, వడలను చట్నీ, సాంబార్‌తోనే ఎందుకు తినాలి. వేడి వేడి దోశను ఐస్‌ క్రీమ్‌తో ఎందుకు తినకూడదు అనే ఓ వినుత్నమైన ఆలోచన ఈ టిఫిన్‌ సెంటర్‌ యాజమాన్యానికి వచ్చింది. ఆ ఐడియాను ట్రై చేశారు. ఇంకేముంది సక్సెస్ అయిపోయింది. ఆ చిన్న ఐడియా అతని వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయాలుగా తీర్చిదిద్దింది.ఈ ఐస్ క్రీమ్ దోసెల్లో రకరకాల ఫ్లేవర్లు కూడా ఉండటం మరో విశేషం.  

అక్కడ దోసె వేసేటప్పుడు దోసెకు పైనా, కిందా ఐసీ క్రీం పూత పూస్తారు. ఆ తర్వాత ప్లేట్‌లో ఐస్ క్రీం స్కూప్స్ ఇస్తారు. తీసుకుని దోసెను తుంచుకుని ఐస్ క్రీంలో అద్దుకుని తినాలి. టెస్ట్ వావ్ అని ఇక్కడ తిన్న వారు అభిప్రాయపడుతున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్ర వద్దకు చేరింది. ఈ వినుత్నమైన ఆలోచనకి అయన ఫిదా అయిపోవటం..దాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయం చేస్తుంటారనే విషయం తెలిసిందే. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. “భారతీయ వీధి విక్రేతలు ఆవిష్కరణకు వర్ణించలేనిది. నేను ఐస్‌ క్రీం దోశ కంటే వారి వినూత్న ఆలోచనకి ఫిదా అయ్యానని ఆనంద్‌ మహీంద్ర ట్వీట్ చేశారు.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే..ఈ టిఫిన్ సెంటర్ కేవలం  ఐస్ క్రీం దోసకు మాత్రమే కాదండోయ్..ఐస్ క్రీం ఇడ్లీ కూడా ఉంది.