Union Minister Nitin Gadkari : అలా జరిగితే.. చెన్నై నుండి బెంగళూరుకు రెండు గంటల్లో ప్రయాణం చేయొచ్చు..

బెంగళూరు - చెన్నై ఎక్స్‌ప్రెస్ వే బెంగళూరు శివార్లలోని హోస్కోట్ నుంచి ప్రారంభమై తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ముగుస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలమీదుగా వెళ్తుంది.

Union Minister Nitin Gadkari : అలా జరిగితే.. చెన్నై నుండి బెంగళూరుకు రెండు గంటల్లో ప్రయాణం చేయొచ్చు..

Union Minister Nitin Gadkari,

Updated On : September 8, 2023 / 9:47 AM IST

Nitin Gadkari : బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే 2023 చివరిలో లేదా 2024 జనవరి నాటికి ప్రారంభించడం జరుగుతుందని, తద్వారా రెండు మెట్రోపాలిటన్ నగరాల మధ్య ప్రయాణం త్వరలో రోడ్డు మార్గాల ద్వారా సులభం అవుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ వే పూర్తయితే.. కేవలం రెండు గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నైకు రాకపోకలు సాగించొచ్చునని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం సాగించాలంటే ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది.

Minister Nitin Gadkari : వీఐపీల వాహనాలకు సంగీతం, సైరన్ ప్లేస్‌లో భారతీయ సంగీతం : మంత్రి నితిన్‌ గడ్కరీ

అశోక్ లేలాండ్ 75వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని మాట్లాడారు. చెన్నైలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించాను. బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించబడుతుంది. ఈ ప్రాంతాల్లో లగ్జరీ బస్సులు, స్లీపర్ కోచ్ లను ప్రారంభించవచ్చునని మంత్రి అన్నారు. ఎన్డీయే హయాంలో ఢిల్లీ నుంచి చెన్నై నుంచి సూరత్, నాసిక్, అహ్మద్ నగర్, కర్నూలు, చెన్నై, కన్యాకుమారి, తిరువనంతపురం, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, యాక్సెస్ – నియంత్రిత హైవే ప్రాజెక్టు ద్వారా కలుపుతున్నామని అన్నారు. జాతీయ రజధాని, జైపూర్ మధ్య ఎలక్ట్రిక్ కేబుల్ హైవేను నిర్మించే ప్రక్రియ ఉందని తెలిపారు. బయో ఇంధనాలు, ఈ- వాహనాలు వంటి ప్రత్యామ్నాయ శక్తిని ఉపయోగించగల వాహనాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని అశోక్ లేలాండ్, ఇతర వాహన తయారీ కంపెనీలను కేంద్ర మంత్రి కోరారు.

Nitin Gadkari: అవినీతి నేతలు పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి

బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ వే బెంగళూరు శివార్లలోని హోస్కోట్ నుంచి ప్రారంభమై తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ముగుస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలమీదుగా వెళ్తుంది. 2022 మే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన చేశారు. దీని పొడవు 262 కిలో మీటర్లు ఉంటుంది. రూ. 14,870 కోట్లకుపైగా వ్యయంతో దీని నిర్మాణం కొనసాగుతోంది. 2024 జనవరి నెలలో ఈ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించే అవకాశం ఉంది.