Samsung నుంచి Xiaomi వరకూ: 6వేలకే 4కెమెరాల ఫోన్

ఫొటో కావాలంటే ఫొటో స్టూడియోల చుట్టూ తిరిగే రోజులు పోయి HD, DSLR కెమెరాలకు వచ్చాం. టెక్నాలజీ ఫార్వార్డ్ అయి అంతే క్వాలిటీ ఫొటోలు స్మార్ట్ ఫోన్లలోనూ వచ్చేస్తుంటే అంతకుమించి ఇంకేం కావాలి. పైగా అది ఆరువేలకే దొరుకుతుంటే సొంతం చేసుకోవాలని ఎవరికుండదు. నాలుగు కెమెరాల బెస్ట్ ఫోన్లు Samsungతో Xiaomiలాంటి ఫోన్ల వివరాలు ధరల వారీగా ఉన్నాయి.
Samsung Galaxy A9 ధర రూ.24వేల 900
ప్రపంచంలోనే తొలి క్వాడ్ కెమెరా Samsung Galaxy A9. అద్భుతమైన లెన్స్‌లతో ఆటో ఫోకస్, రేర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 10రెట్లు జూమ్ చేయగల డిజిటల్ జూమ్. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 24MPతో టెంప్టింగ్‌గా ఉంది.
కెమెరాలు: 24MP+ 5MP + 10MP +8MP
డిస్ ప్లే: 6.30అంగుళాలు
ప్రోసెసర్: Qualcomm Snapdragon 660
ఫ్రంట్ కెమెరా: 24MP
ర్యామ్: 6జీబీ
స్టోరేజి: 128జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 3800ఎమ్ఏహెచ్
ఓస్(ఆపరేషనల్ సాఫ్ట్‌వేర్): ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
రిసొల్యూషన్: 1080×2220 పిక్సెల్స్
Huawei Nova 3i ధర రూ.21వేల 999
ఫోన్ వాడటానికే కాదు.. చూడటానికీ బెస్ట్ లుక్‌తో.. స్లిమ్‌గా ఇతర బ్రాండ్ల కంటే స్మార్ట్‌గా కనిపిస్తుంది. డ్యూయల్ ఫ్రంట్, డ్యూయెల్ రేర్ కెమెరాలతో అందుబాటులో ఉంది. బ్లాక్, పర్పుల్, బ్లూ కలర్స్ లో అందుబాటులో ఉంది.
డిస్ ప్లే: 6.30అంగుళాలు
ప్రోసెసర్: HiSilicon Kirin 710
ఫ్రంట్ కెమెరా: 24MP+2MP
రేర్ కెమెరా: 16MP+2MP
ర్యామ్: 4జీబీ
స్టోరేజి: 128జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 3340ఎమ్ఏహెచ్
ఓస్(ఆపరేషనల్ సాఫ్ట్‌వేర్): ఆండ్రాయిడ్ 8.1
రిసొల్యూషన్: 1080×2340 పిక్సెల్స్
Xiaomi Redmi Note 6 Pro ధర రూ.9వేల 549
నాలుగు కెమెరాల ఫోన్లలో ప్రస్తుతం Xiaomi Redmi Note 6 Pro బెస్ట్ గా నిలిచింది. డ్యూయల్ ఫ్రంట్, డ్యూయెల్ రేర్ కెమెరాలతో అందుబాటులో ఉంది.
డిస్ ప్లే: 6.26అంగుళాలు
ప్రోసెసర్: Qualcomm Snapdragon 636
ఫ్రంట్ కెమెరా: 20MP+2MP
రేర్ కెమెరా: 12MP+5MP
ర్యామ్: 4జీబీ
స్టోరేజి: 64జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4000ఎమ్ఏహెచ్
ఓస్(ఆపరేషనల్ సాఫ్ట్‌వేర్): ఆండ్రాయిడ్
రిసొల్యూషన్: 1080×2280 పిక్సెల్స్
Honor 9i ధర రూ.8వేల 999
ధరతో పాటు డిస్ ప్లే సైజ్ కూడా తగ్గినప్పటికీ కెమెరాపరంగా బెస్ట్ ఫోన్. గోల్డ్ లేదా అరోరా బ్లూ కలర్‌లో అందుబాటులో ఉంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.8వేల 999కి, టాటా క్లిక్యూలో రూ.12వేల 639కి దొరుకుతుంది.
డిస్ ప్లే: 5.90అంగుళాలు
ప్రోసెసర్: HiSilicon Kirin 659
ఫ్రంట్ కెమెరా: 16MP
రేర్ కెమెరా: 16MP
ర్యామ్: 4జీబీ
స్టోరేజి: 64జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 3340ఎమ్ఏహెచ్
ఓస్(ఆపరేషనల్ సాఫ్ట్‌వేర్): ఆండ్రాయిడ్ 7.0
రిసొల్యూషన్: 1080×2160 పిక్సెల్స్
InFocus Snap 4 ధర రూ.5వేల 979
ఆరు వేల రూపాయలకు స్మార్ట్ ఫోన్లో సాధారణ ఫీచర్లు మాత్రమే ఊహించగలం. అటువంటిది నాలుగు కెమెరాలతో ఫోన్ దొరికిందంటే అది బెస్టే. 13+8 MPరేర్ కెమెరాతో పాటు 8+8 MPఫ్రంట్ కెమెరాలతో మార్కెట్ లో ఉంది. బ్లాక్, ప్లాటినం గోల్డ్ రంగుల్లో ఫోన్ దొరుకుతుంది.
డిస్ ప్లే: 5.20అంగుళాలు
ప్రోసెసర్: మీడియా టెక్ ఎమ్6750
ఫ్రంట్ కెమెరా: 8MP
రేర్ కెమెరా: 13MP
ర్యామ్: 4జీబీ
స్టోరేజి: 64జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 3000ఎమ్ఏహెచ్
ఓస్(ఆపరేషనల్ సాఫ్ట్‌వేర్): ఆండ్రాయిడ్ 7.0
రిసొల్యూషన్: 720×1280 పిక్సెల్స్