గూగుల్ చెబుతోంది : బెస్ట్ టాయిలెట్ పేపర్ పాక్ జెండాలు

  • Published By: madhu ,Published On : February 18, 2019 / 09:23 AM IST
గూగుల్ చెబుతోంది : బెస్ట్ టాయిలెట్ పేపర్ పాక్ జెండాలు

వరల్డ్‌ బెస్ట్ టాయిలెట్ పేపర్ ఏదీ అంటే పాక్ జెండా అంట. అవును గూగులమ్మ ఇదే చెబుతోంది. ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌లో దీని గురించి వెతికితే పాక్ దేశానికి చెందిన జెండా కనిపిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భారతదేశంలోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ఏకంగా 44 మంది జవాన్లు అమరులు కావడంపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతికారం తీర్చుకోవాల్సిందేనంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. 

తాజాగా గూగుల్‌లో #besttoiletpaperintheworld హ్యాష్ ట్యాగ్‌తో దీనికి సంబంధించిన ఫొటోలు భారీగా షేర్ అవుతున్నాయి. దీనిపై ఆయా సామాజిక మాధ్యమాల్లో ఫుల్ జోక్స్ పేలుతున్నాయి. ఈ విషయంపై పాక్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. వెంటనే గ్రహించిన గూగుల్ పెద్దలు సరి చేసే పనిలో నిమగ్నమయ్యారంట. అయితే..ఇప్పటికీ గూగుల్‌లో వెతికితే పాక్ జెండానే దర్శనమిస్తోంది. గతంలో కూడా గూగుల్‌లో ఇలాంటిదే జరిగింది. ‘ఇడియట్’ అని టైప్ చేస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటో వచ్చిన సంగతి తెలిసిందే. 

Read Also : గ్లోబల్ ట్రెండ్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ కు బాలయ్య డైలాగ్ వార్నింగ్స్

Read Also : సివంగులు : క్లాస్ రూంలోనే మందుకొట్టిన విద్యార్థినులు

Read Also : OMG : చావు దగ్గరకు వచ్చి ఆగింది